📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Punch Kun: నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

Author Icon By Vanipushpa
Updated: March 17, 2026 • 2:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జపాన్‌కు చెందిన వైరల్ కోతి పిల్ల పంచ్ కున్(Punch Kun) (ముద్దుగా పంచ్)కు తోడు దొరికేసింది. పుట్టగానే తల్లి వదిలేయడంతో పాటు సహచర కోతుల గుంపు కూడా పంచ్ ను దూరం పెట్టడంతో జూ సిబ్బంది ఇచ్చిన ఒరంగుటాన్ బొమ్మను తల్లిగా భావిస్తూ దానితోనే రోజులు వెళ్లదీస్తున్న పంచ్ కు తన ఈడు ఆడ కోతి పిల్ల ఒకటి తోడైంది. ప్రస్తుతం పంచ్ ఒరంగుటాన్ బొమ్మ కోతితో కాకుండా..తనకు జత అయిన గర్ల్ ఫ్రెండ్ కోతి పిల్లతో కలిసి ముద్దు ముచ్చట్లలో మునిగి తేలుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకాలం అందరూ ఉన్నా.. ఒంటరిగా బతికేస్తున్న పంచ్ గాడిని దేవుడు కరుణించి ఇన్నాళ్లకు ఓ తోడును అందించాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read Also: Summer Vacation Plans: యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

Punch Kun: I found a girlfriend..!..Punch Ananda Kerintalu

పంచ్‌ను ఇతర కోతి పిల్లలతో పరిచయం

సాధారణంగా తల్లి వదిలేసిన కోతి పిల్లలు ఇతర కోతులతో కలవడం చాలా కష్టం. కానీ జూ అధికారులు చాలా ఓపికగా పంచ్‌ను ఇతర కోతి పిల్లలతో పరిచయం చేశారు. ఇప్పుడు దానికి దొరికిన ‘గర్ల్ ఫ్రెండ్’ తోటి అది ఆడుకోవడం చూస్తుంటే, పంచ్ తన ఒంటరితనాన్ని పూర్తిగా మర్చిపోయిందని అర్థమవుతోంది.

నెటిజన్ల రియాక్షన్: సోషల్ మీడియాలో పంచ్ వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. “ప్రేమకు భాష అక్కర్లేదు, బొమ్మనైనా, తోటి కోతినైనా పంచ్ ఆలింగనం చేసుకునే విధానం అద్భుతం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే “పంచ్ ఇప్పుడు బొమ్మను వదిలేసి తన కొత్త స్నేహితురాలితో హ్యాపీగా ఉండాలి” అని కోరుకుంటున్నారు.

Ichikawa City Zoo Monkey and Orangutan Toy Punch-kun Monkey Telugu News Paper Telugu News Today Viral Animal Videos Viral Monkey Japan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.