📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Sameer Das: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

Author Icon By Vanipushpa
Updated: January 13, 2026 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో హిందూ యువకుడు అత్యంత oe హత్యకు గురయ్యాడు. ఫెని జిల్లాలోని దగన్‌భుయాన్ ఉపజిల్లాలో 27 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ సమీర్ దాస్‌ను దుండగులు దారుణంగా నరికి చంపారు. బంగ్లాదేశ్‌ (Bangladesh)లో గత 24 రోజుల్లోనే హిందువులపై జరిగిన 9వ దాడి ఇది కావడం గమనార్హం. వరుస హత్యలతో అక్కడి హిందూ సమాజం బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు సమీర్ దాస్ (27) ఆటో నడుపుకుంటూ జీవించే పేద యువకుడు. జగత్‌పుర్ గ్రామానికి చెందిన సమీర్, ఆదివారం సాయంత్రం ఆటో తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి చాలా సమయం గడిచినా అతను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామస్తులకు జగత్‌పుర్ పొలాల్లో ఒక మృతదేహం కనిపించింది. వెళ్లి చూడగా అది సమీర్ దాస్‌దేనని గుర్తించారు. చలిలో గడ్డకట్టుకుపోయిన స్థితిలో శవం పడి ఉండటం చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Read Also: AP :ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు

Sameer Das: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు

పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. సమీర్ శరీరంపై తీవ్రమైన కత్తి గాట్లు ఉన్నాయి. దుండగులు అతన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ విచక్షణారహితంగా నరికి చంపారు. అనంతరం అతని ఆటోరిక్షాను దొంగిలించి పరారయ్యారు. కేవలం ఆటో కోసమే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై దగన్‌భుయాన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్​చార్జ్ మహమ్మద్ ఫైజుల్ అజీమ్ నోమన్ స్పందించారు. “సమీర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టుమార్టం కోసం ఫెని జనరల్ ఆసుపత్రికి తరలించాం. అతని ఆటోరిక్షా కనిపించడం లేదు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడినప్పటి నుంచి మైనారిటీలపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలు, దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bangladesh Violence communal tensions Hindu youth murder Human Rights Violations mob attacks Religious Intolerance South Asia news Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.