📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Chikkaballapur Molvi: మసీదు ప్రాంగణంలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం

Author Icon By Shobha Rani
Updated: June 3, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర (Chikkaballapur) జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్నారిపై లైంగిక దాడి జరగడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఒక మసీదు (Masjid) ప్రాంగణంలో ఆరేళ్ల చిన్నారిపై ఓ మౌల్వీ (Molvi) తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఒక మసీదులో పనిచేసే మౌల్వీ(Molvi) కి తండ్రి. స్థానిక జమాత్ కమిటీ గౌరవపూర్వకంగా అతడికి మసీదు ప్రాంగణంలోనే నివాసం ఉండేందుకు ఒక గదిని కేటాయించింది. అయితే, ఈ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన నిందితుడు చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి ఆరేళ్ల బాలికను మసీదులోని తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Chikkaballapur Molvi: మసీదు ప్రాంగణంలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం

దోషికి కఠిన శిక్ష తప్పదు
నిందితుడు సుమారు 20 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి చిక్కబళ్లాపురానికి (Chikkaballapur) వలస వచ్చి స్థిరపడ్డాడని, ఫుట్‌పాత్‌పై బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి మసీదులో ఆశ్రయం కల్పించిన స్థానిక జమాత్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులకు అప్పగించే ముందు బాధితురాలి తల్లి, స్థానికులు కలిసి నిందితుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చ. మతపరమైన ప్రదేశాలను ఆశ్రయంగా తీసుకున్న వారు అలాంటి దుర్మార్గానికి పాల్పడటమంటే నైతిక పతనానికి నిదర్శనం. చిన్నారి కోసం న్యాయం జరగాలి, ఈ ఘటన మరెక్కడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

Read Also: Sana Yousuf: పాక్ లో సోషల్ మీడియా స్టార్ సనా యూసుఫ్ హత్య..

a six-year-old girl Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Violence against

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.