మద్యం ధరలు ఎంత తక్కువగా ఉంటే మందుబాబులకు ఎంత ఆనందం. ఇక నిత్యం అదే మత్తులో జోగుతారేమో! అందుకే ఎక్కడ ధరలు తక్కువగా ఉంటే అక్కడి నుంచి మద్యం కొనుగోలు చేసుకుని, ఇండ్లకు తెచ్చుకుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత చౌవుకైన బీరు ఎక్కడో తెలుసా? కేవలం 18రూపాయలకు బీర్ (Beer) లభిస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఇలాంటి ధర మనదేశంలో ఉంటే ఇక మందుబాబులకు పండుగే పండుగ. వియత్నాంలో మద్యం ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయి. ఇక్కడ లభించే స్థానిక బీరు పేరు ‘బియా హోయి’ ఒక గ్లాసు బియా హోయ్ ధర సుమారు 5,000 వియత్నామీస్ డాంగ్ (భారత కరెన్సీలో 18 రూపాయలు). అయితే ఈ ధర కొన్నిప్రాంతాల్లో స్వల్పంగా మారవచ్చు. పర్యాటక ప్రాంతాలలో, ఈ బీరు ధర రూ.20 నుంచి రూ.25 మధ్య ఉండవచ్చు.
Read also: President: ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో బంకర్‌లోకి వెళ్లమన్నారు..అసిఫ్ అలీ
Beer is available for just ₹18
వాటర్ బాటిల్ ధర వందరూపాయలు
ఒక సీల్డ్ వాటర్ బాటిల్ ధర సుమారు 30,000డాంగ్ (రూ.100) ఉంటుంది. వియత్నామీస్ బీరు తక్కువ ధరలో అందించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. బియా హోయి స్థానికంగా తయారవుతుంది. దీన్ని పెద్ద బ్యారెల్స్ లో నిల్వ చేసి, రోజువారీగా తాజా బీరు తయారు చేస్తారు. ఈ బీరు సీసాల్లో లేదా డబ్బాల్లో ప్యాక్ చేయబడదు. ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఖర్చులు లేకపోవడం కూడా ఈ బీరు ధరను తక్కువగా ఉంచడానికి దోహదం చేస్తున్నది. అంతేకాదు బీరు వ్యాపారం వియత్నాంలో అనేకమందికి ఉపాధిని కల్పిస్తున్నది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. మద్యం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి దూరంగా ఉండడమే మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: