📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Viaan Mulder: చరిత్ర సృష్టించిన వియాన్ మల్డర్

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 5:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌతాఫ్రికా తాత్కాలిక టెస్ట్ కెప్టెన్,ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆల్‌రౌండర్‌గా పోటీపడుతున్న వియాన్ మల్డర్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాశాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో, కెప్టెన్‌గా తొలి టెస్ట్‌ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు గా వియాన్ మల్డర్ నిలిచాడు.జింబాబ్వే (Zimbabwe) తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వియాన్ మల్డర్ 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.ఈ త్రిశతకంతో ఈ సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డ్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. అతను 2008లో సౌతాఫ్రికా (South Africa) తో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. అప్పటి నుంచి ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.

విదేశీ గడ్డపై

సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా వియాన్ మల్డర్(334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లతో 367 నాటౌట్) నిలిచాడు. ఈ క్రమంలో అతను హాషిమ్ ఆమ్లా(311) పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు.సౌతాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా కూడా మల్డర్ (Viaan Mulder) రికార్డ్ సాధించాడు.టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా కూడా మల్డర్ నిలిచాడు. అతను 27 ఏళ్ల 138 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను 61 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 1964లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ సింప్సన్ 28 ఏళ్ల 171 రోజుల వయసులో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తాజాగా ఈ రికార్డ్‌ను మల్డర్ అధిగమించాడు. విదేశీ గడ్డపై జరిగిన టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన ఆటగాడిగా కూడా మల్డర్ నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హనీఫ్ మహమ్మద్(337) రికార్డ్‌ను అధిగమించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాడి కూడా మల్డర్ నిలిచాడు.

తుది జట్టులో

మల్డర్ ట్రిపుల్ సెంచరీ ధాటికి ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 626/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఐపీఎల్‌ 2025 సీజన్‌లో వియాన్ మల్డర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ గాయపడటంతో అతని స్థానాన్ని వియాన్ మల్డర్‌తో భర్తీ చేసింది. మల్డర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ట్రిపుల్ సెంచరీ బాదిన వియాన్ మల్డర్‌కు సన్‌రైజర్స్ హైదారాబాద్ అభినందనలు తెలియజేసింది. వరుస పోస్ట్‌లతో సంతోషం వ్యక్తం చేసింది. డబ్ల్యూటీసీ 2025 విజయం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) గాయంతో జట్టుకు దూరం కావడంతో వియాన్ మల్డర్ కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు.

వియాన్ మల్డర్ జననం ఎప్పుడు?

వియాన్ మల్డర్ జననం 1998 అక్టోబర్ 19న జరిగింది.అతను దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఆల్‌రౌండర్, టెస్ట్ క్రికెట్‌లో రాబోయే తరం నాయకుల్లో ఒకడిగా పేరు పొందుతున్నాడు.

వియాన్ మల్డర్.. జీవిత నేపథ్యం

పూర్తి పేరు: పీటర్ వియాన్ మల్డర్ (Pieter Wiaan Mulder)పుట్టిన తేదీ: 19 అక్టోబర్ 1998
,జన్మస్థలం: జొహానెస్‌బర్గ్, గౌతెంగ్, దక్షిణాఫ్రికా,వయస్సు (2025లో): 26 సంవత్సరాలు,
భూమిక: ఆల్‌రౌండర్ (రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్)జాతీయ జట్టు: దక్షిణాఫ్రికా,IPL జట్టు: సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad).

Read hindi news: hindi.vaartha.com

Read Also: YS Jagan: స్వర్ణ పతక విజేత.. రెడ్డి భవానిని అభినందించిన వైఎస్ జగన్

Breaking News latest news south africa test cricket Telugu News viyann mulder 300 runs viyann mulder test debut as captain viyann mulder triple century

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.