📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Venezuela: మదురో తరపున వాదించే లాయర్ ఈ కేసులో నెగ్గేనా?

Author Icon By Saritha
Updated: January 6, 2026 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత శనివారం తెల్లవారుజామున అమెరికా అకస్మాత్తుగా వెనిజులాపై (Venezuela) దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolás Maduro) ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. అమెరికా సైన్యం వెనిజులాపై మెరుపుదాడి చేసిన అమెరికా దళాలు.. ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను నిర్బంధించి అమెరికాకు తరలించాయి. ఈ హైప్రొఫైల్ కేసు విచారణ ఇప్పుడు మన్ హటన్ ఫెడరల్ కోర్టులో ప్రారంభమైంది. అయితే ఈ కేసులో నిందితుల కంటే కూడా వాదనలు వినే న్యాయమూర్తి, వాదించే న్యాయవాది వివరాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హల్ చేస్తున్నాయి.

Read also: TTD: కపిలతీర్థంలో పిండ ప్రధానం పై అర్చకుల ఆందోళన

ఎవరీ ఆల్విన్ హెల్లర్ స్టీన్

(Venezuela) ఈ కేసును విచారిస్తున్న మన్ హటన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అల్విన్ హెల్లర్ స్టీన్ వయసు ఇప్పుడు 92 ఏళ్లు. 1933లో న్యూయార్క్లో జన్మించిన ఆయన..అమెరికా న్యాయచరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడిగా పేరుగాంచారు. కొలంబియా యూనివరినసటీ నుంచి లా పూర్తి చేసిన అల్విన్ తొలినాళ్లలో ఆర్మీ లాయర్ గా పనిచేశారు. 1998లో అపనపటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయన్ని జడ్జిగా నామినేట్ చేశారు. 9/11 ఆల్ ఖైదా ఉగ్రదాడుల కేసు నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ‘హస్ మనీ’ కేసు వరకు అనేక కీలక కేసులను అల్విన్ యే వాదించారు. ముఖ్యంగా ట్రంప్ అభ్యర్థనలను తోసిపుచ్చడం, వెనిజులా డ్రగ్స్ ముఠాల అక్రమ రవాణా 15ఏళ్లుగా విచారణ జరుపుతుండటం అల్విన్ ప్రత్యేకత. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో మదురోను విచారించే బాధ్యత ఆయనపై పడింది.

అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని ఎదిరించి నిలబడాలంటే బలమైన న్యాయవాది కావాలి. అందుకే మదురో తన తరపున వాదించేందుకు ప్రముఖ లాయర్ బారీ జె.పోలక్ ను ఎంచుకున్నారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను 2024 జైలు నుంచి విడిపించడంలో పోలక్ కీలకపాత్ర పోషించారు. ఇక వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతు స్వీకరించిన డెల్సీ రోడ్రిస్ట్ తో అమెరికా సంబంధాలు కొనసాగిస్తుందా? అన్న దానిపై కూడా వివరణ ఇచ్చారు. ఆమెతో ఎటువంటి కమ్యూనికేషన్ లేదని తేల్చి చెప్పారు. కాగా అల్విన్ హెల్లర్ స్టీన్ కేసుపై ఏవిధంగా వాదించి, గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:



Alvin Heller Stein Latest News in Telugu Maduro case Manhattan Federal Court Telugu News US Military Venezuela political crisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.