Venezuela oil reserves : వెనిజులా చమురు సంపదపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులాలో ఉన్న అతిపెద్ద చమురు నిల్వలను అమెరికా తన ఆధీనంలోకి తీసుకోనుందని, దీని ద్వారా అమెరికాకు భారీగా ఆర్థిక లాభాలు చేకూరనున్నాయని ఆయన తెలిపారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం మెరుపు ఆపరేషన్‌లో అరెస్ట్ చేసి న్యూయార్క్‌కు తరలించిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెనిజులాలోని తాత్కాలిక పాలన 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల నాణ్యమైన ముడి చమురును అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ విలువ ప్రకారం ఈ చమురు ధర సుమారు 2.8 బిలియన్ డాలర్లు (రూ. 23 వేల కోట్లకు పైగా)గా అంచనా వేయబడుతోంది.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ, ఈ చమురు (Venezuela oil reserves) విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. ఈ నిధులను వెనిజులా ప్రజల సంక్షేమానికి, అలాగే అక్కడ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన చమురు మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు వినియోగిస్తామని తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ చమురు సంస్థలు వెనిజులాలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయని ఆయన చెప్పారు.

అయితే ట్రంప్ చర్యలను కొందరు అంతర్జాతీయ నిపుణులు ‘ఆధునిక సామ్రాజ్యవాదం’గా విమర్శిస్తున్నారు. చమురు సంపదపై నియంత్రణ కోసమే మదురోను గద్దె దించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటన అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 1.5 శాతం తగ్గాయి. దీని వల్ల అమెరికాలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజులాకు ఉండగా, ఇకపై ఆ దేశ చమురు విధానాలపై అమెరికానే కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: