📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Venezuela: అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన

Author Icon By Radha
Updated: January 5, 2026 • 9:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెనిజులా(Venezuela) దేశంపై అమెరికా సాగిస్తున్న ఉగ్రదాడులు, అక్రమ జోక్యం, అంతర్జాతీయ న్యాయస్థానాల నిబంధనలకు విరుద్ధంగా వెనిజులా దేశాధ్యక్షుడిని బంధించిన చర్యలను తీవ్రంగా ఖండిస్తూ సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా, కెవిపిఎస్, ఆవాజ్, యుటిఎఫ్, ఐలు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ వద్ద నుంచి ప్రధాన వీధిలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఓబులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమైన వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వ మార్పు లక్ష్యంగా అమెరికా చేపడుతున్న చర్యలు బహిరంగ సామ్రాజ్యవాద ఉగ్రవాదానికి నిదర్శనమన్నారు.

Read Also: America: మదురోను పట్టుకునేందుకు చేసిన ఖర్చు

ఆర్థిక ఆంక్షలు, బెదిరింపులు, రాజకీయ కుట్రల ద్వారా వెనిజులా ప్రజల జీవన హక్కులపై నేరుగా దాడి చేస్తున్నదని విమర్శించారు.అంతర్జాతీయ న్యాయస్థానాల నిబంధనలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను కాలరాస్తూ వెనిజులా దేశాధ్యక్షుడిని బంధించడం ప్రపంచ శాంతికి తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఇటువంటి సామ్రాజ్యవాద దాడులను ప్రపంచ దేశాలు, ప్రజాసంఘాలు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.వెనిజులా విషయంలో భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. ఒకప్పుడు సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేయరాదు అనే విదేశాంగ విధానాన్ని అనుసరించిన భారతదేశం, నేడు అమెరికా సామ్రాజ్యవాద విధానాల పట్ల మౌనం పాటించడం సమంజసం కాదన్నారు.

భారత ప్రభుత్వం వెంటనే వెనిజులా(Venezuela) సార్వభౌమత్వానికి మద్దతుగా నిలిచి, అమెరికా దాడులను ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా, కెవిపిఎస్, ఆవాజ్, యుటిఎఫ్, ఐలు సంఘాల జిల్లా నాయకులు, పరమేష్, అశ్వని, వలి, తిరుపాల్, రాంరెడ్డి, వెంకట్ నారాయణ, ఏటీఎం నాగరాజ్, తిరుమలేష్, భీమేష్, ప్రసాద్ రెడ్డి, సతీష్, వంశీ, శివారెడ్డి, వీరేంద్ర , కోటేశ్వరప్ప, గోవిందప్ప, నాగేంద్ర వీరితోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu PoliticalNews USAttacks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.