📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest News: Vaishali Rameshbabu – ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 2:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత చెస్‌ రంగం ఎప్పటినుంచో కొత్త కొత్త విజయాలను అందుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు (Tamil Nadu) కు చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్‌బాబు (Vaishali Rameshbabu) తాజాగా మరో చారిత్రక ఘనతను సాధించారు. స్విట్జర్లాండ్‌ (Switzerland) లో జరిగిన ఫిడే గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్‌లో ఆమె అపూర్వ ప్రతిభను ప్రదర్శించి, వరుసగా రెండోసారి విజేతగా నిలిచారు. ఈ టోర్నమెంట్‌ను రెండు సార్లు గెలుచుకున్న మొదటి మహిళా క్రీడాకారిణి (First female athlete) గా వైశాలి పేరు చెస్‌ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోనుంది.

కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు అర్హత సాధించిన మూడో భారత మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచారు.ఈ అద్భుత విజయం సాధించిన వైశాలికి భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అభినందనలు తెలిపారు. తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో మోడీ ఇలా రాసుకొచ్చారు. “అద్భుతమైన ఘనత. రమేష్‌బాబు వైశాలికి అభినందనలు. ఆమె పట్టుదల, అంకితభావం ఆదర్శనీయం. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.” అని ప్రధాని మోడీ రాశారు.

ఈ అద్భుతమైన విజయానికి చాలా చాలా అభినందనలు

ప్రధాని మోడీతో పాటు వైశాలి తమ్ముడు, ప్రముఖ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద (R. Pragnananda) కూడా తన సోదరిని అభినందించారు. ప్రజ్ఞానంద ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. “అక్కా.. నాకు మీరు సాధించిన విజయంతో చాలా గర్వంగా ఉంది. ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ గెలవడం ఒక అద్భుతమైన విజయం.

టోర్నమెంట్ (Tournament) అంతటా మీరు చూపించిన ఆత్మవిశ్వాసం, సంకల్పం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ అద్భుతమైన విజయానికి చాలా చాలా అభినందనలు.” అని ప్రజ్ఞానంద శుభాకాంక్షలు తెలిపారు.ఓపెన్ సెక్షన్‌లో భారత స్టార్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి తన చివరి గేమ్‌ను విన్సెంట్ కేమర్‌తో డ్రా చేసుకున్నాడు, దీంతో అతడు క్యాండిడేట్స్‌లో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ సెక్షన్‌లో అనీష్ గిరి, జర్మన్ గ్రాండ్ మాస్టర్ మథియాస్ బ్లూబామ్ క్యాండిడేట్స్‌కు అర్హత సాధించారు

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/icc-mohammed-siraj-wins-prestigious-icc-award/sports/548129/

Breaking News FIDE Grand Swiss Tournament historic achievement Indian Chess latest news Tan Zhongyi Telugu News title winner Vaishali Rameshbabu women’s chess

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.