అలాస్కాలోని ఉత్‌కియాగ్విక్ (Utkiagvik) పట్టణంలో ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు సుమారు రెండు నెలల పాటు సూర్యుడు కనిపించడు. భూమి వంపు కారణంగా ఏర్పడే ఈ దృగ్విషయాన్ని ‘పోలార్ నైట్’ అంటారు. ఈ సమయంలో పట్టణం మొత్తం చీకటిలో మునిగిపోతుంది. అక్కడి ప్రజలు ఈ పరిస్థితికి అలవాటు పడి, ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. జనవరిలో సూర్యుడు తిరిగి ఉదయించినప్పుడు, ప్రజలు దానిని ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు, ఆనందోత్సాహాలతో ఒకరినొకరు అభినందించుకుంటారు.
Read Also: Bangladesh: దేశాన్ని హింసగుండా నడిపిస్తున్న యూనస్: షేక్ హసీనా
ఆర్క్‌టిక్ సర్కిల్‌కు ఉత్తర భాగం
అలస్కా..అమెరికాలోని ఓ రాష్ట్రం. ఉత్తర అమెరికా ఖండానికి అత్యంత వాయువ్యంగా ఉన్న భూభాగం. అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం భూభాగపరంగా అన్ని అమెరికా రాష్ట్రాలకన్నా పెద్దది. అలాస్కా భూభాగం రష్యా నుండి అక్టోబరు 18, 1867 న ఏడు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం ఉత్‌కియాగ్విక్ (Utkiagvik). ఈ పట్టణం ఆర్క్‌టిక్ సర్కిల్‌కు ఉత్తర భాగంలో ఉంటుంది.
అంతకుముందు ఈ పట్టణాన్ని బారో అని పిలిచేవారు. ఈ పట్టణంలోని రెండు నెలలు చిమ్మచీకటిలో గడపనున్నారు. అంటే ఇక్కడ మరో రెండు నెలల పాటు సూర్య కాంతి కనిపించదు. ఈ ప్రక్రియనే పోలార్ నైట్ అని పిలుస్తారు. ఏటా శీతాకాలంలో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: