📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

USA: తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

Author Icon By Saritha
Updated: January 29, 2026 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌లో (Pakistan) నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ఆ దేశానికి ప్రయాణాలు పెట్టుకోవద్దని అమెరికా (USA) తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదం, నేరాలు, అంతర్యుద్ధం, కిడ్నాపుల వంటి ప్రమాదాలు పొంచి ఉన్నందున పాకిస్థాన్ ప్రయాణ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు గురువారం కొత్త ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. పాకిస్థాన్‌కు ‘లెవెల్ 3’ కేటగిరీ హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించింది. లెవెల్ 3 అంటే అధిక ప్రమాదం ఉన్న ప్రాంతమని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అర్థం.

Read Also: War: ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

ప్రధాన రవాణా కేంద్రాలు, మార్కెట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, రైళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా దాడులు జరగవచ్చని అమెరికా (USA) విదేశాంగ శాఖ తన అడ్వైజరీలో వివరించింది. ముఖ్యంగా బలూచిస్థాన్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తుంఖ్వా (కేపీ) ప్రావిన్స్, గతంలో కేంద్ర పాలిత గిరిజన ప్రాంతాలుగా ఉన్న ప్రదేశాలకు ‘లెవెల్ 4’ హెచ్చరిక జారీ చేసింది.

ఈ ప్రాంతాలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని స్పష్టం చేసింది. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలలో ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారని, కరాచీ, ఇస్లామాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని అడ్వైజరీలో పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో అనుమతి లేకుండా నిరసనలు చేయడం చట్టవిరుద్ధమని, నిరసనలకు సమీపంలో ఉన్నా భద్రతా దళాల నిఘాకు గురయ్యే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. గతంలో నిరసనల్లో పాల్గొన్న అమెరికన్ పౌరులను నిర్బంధించినట్లు గుర్తు చేసింది. జనవరి 21 నుంచి 75 దేశాలకు చెందిన వలస వీసాల ప్రాసెసింగ్‌ను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ జాబితాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Balochistan Khyber Pakhtunkhwa Latest News in Telugu Pakistan travel advisory Telugu News United States US Department of State

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.