విదేశీయులపై ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తున్నారు. దీంతో వలసదారులపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండడం మాత్రమే కాక అమెరికాకు పెను ముప్పు పొంచి ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల చేసిన ఓ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ‘థర్డ్ వరల్డ్ కంట్రీస్’ నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని అన్నాడు.ఈ విధానాన్ని ఆయన ‘రివర్స్ మైగ్రేషన్’గా అభివర్ణించారు. ఈ విధమైన కఠిన వలస విధానాలు అమెరికాపై భారీ ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.
Read Also: Hong Kong: 128మందికి పెరిగిన హాంకాంగ్ అగ్ని ప్రమాద మృతుల సంఖ్య
టెక్నాలజీ దిగ్గజాల వల్లే అభివృద్ధి
ట్రంప్ దృష్టిలో ప్రస్తుత వలస విధానాలు దేశ అభివృద్ధిని దెబ్బతీశాయి. అయితే, ఆర్థికవేత్తలు మాత్రం దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అమెరికాలోని టెక్నాలజీ దిగ్గజాలు, అగ్రగామి పరిశోధనా సంస్థలు ఎక్కువగా వలస వచ్చిన నిపుణులపై న ఆధారపడతాయి. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల నుండి వచ్చిన ప్రతిభావంతులు టెక్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్ ల స్థాపనకు కీలకపాత్ర పోషిస్తున్నారు.
అమెరికా (America) ఆర్థిక వ్యవస్థకు కేవలం అధిక నైపుణ్యం ఉన్నవాళ్లే కాదు శ్రామికులు కూడా కావాలి. తక్కువ నైపుణ్యం అవసరమయ్యే వ్యవసాయం, నిర్మాణం, అతిథ్యం వంటి రంగాలకు వలస కార్మికులు ఎంతో అవసరం. ‘రివర్స్ మైగ్రేసన్’ అమలైతే ఈ రంగాలలో శ్రామిక శక్తి కొరత ఏర్పడి వేతనాలు పెరిగి, అంతిమంగా వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉంది. ట్రంప్ తరచుగా ప్రస్తావించే ఈ కఠిన విధానాలు, అమెరికాలో వ్యాపారాలు తమ దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించుకోవడంలో అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.
ఇలాంటి విధానాల వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్య వంటి రంగాలకు అవసరమైన నిపుణులను నియమించుకోవడంలో ఆలస్యం లేదా వైఫల్యం సంభవించవచ్చు. వలసదారులు కూడా ఆదాయం, పన్నుల ద్వారా అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ఎంతోకొంత దోహదపడతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: