అమెరికా (USA) అధ్యక్షుడు తాను విధించిన కఠిన నిబంధనలు చివరికి ఆదేశానికి ఉరిగా మారాయి. హెచ్-1 వీసాలపై కఠిన నిబంధనలు పెట్టి, భారీగా ఉద్యోగులను, విద్యార్థుల రాకను అడ్డుకున్నారు. అయితే ఇటీవలే మా దేశానికి నిపుణుల అవసరం ఉందని చెప్పారు. తమదేశంలో ప్రతిభగల వారు లేరని చెబుతూనే నిపుణుల కొరతను అంగీకరించారు. ఇక సుంకాలపై ఏమాత్రం వెనక్కి తగ్గని ట్రంప్ ట్రేడ్ వార్ కు దిగారు.
పలు దేశాలతో విభేదాలను సృష్టించుకున్నారు. దీంతో అమెరికాలో వస్తువుల కొరతల ఏర్పడి, ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇది ఆ ప్రజలకు మోయలేని భారంగా మారింది. ఈ ప్రభావం ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ట్రంప్ పార్టీ ఎన్నికల్లో ఓటమిని చూడాల్సి వచ్చింది. దీంతో ట్రంప్ సుంకాలపై యూటర్న్ తీసుకున్నారు. ఎందుకంటే ధరలపై పెరుగుదలపై అమెరికా అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా కనబడింది.
Read Also: TSLPRB Recruitment: తెలంగాణలో FSL ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) సుంకాల విషయంలో రాజీకి వచ్చారు. అత్యవసర వస్తువులపై టారిఫ్ లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాఫీ, టీ, పళ్లు, రసాలు, కోకో, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయలు, పైనాపిల్స్, నట్స్, ఎరువులు, గొడ్డు మాంసం, అవకాడోలు, టమోటాలు, నారింజలు, అరటిపండ్లు వంటివాటిపై సుంకాలను తీసేశారు. ఈరోజు నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై ప్రజల ఆందోళన ఇటీవల ఆఫ్-ఇయర్ ఎన్నికలలో ఓటర్లు ఆర్థిక వ్యవస్థను తమ ప్రధాన ఆందోళనగా చెప్పారు.
దీని కారణంగానే రిపబ్లికన్లకు ఓటు వేయలేదు.
వర్జీనియా, న్యూజెర్సీలలో ముఖ్యంగా అధికార పార్టీ ఓటమికి కారణమైంది. వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించడానికి ఈక్వెడార్, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, అర్జెంటీనాతో కొత్త ఫ్రేమ్ వర్క్ ఒప్పందాలను ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ తొలగింపు ఉత్తర్వుపై సంతకం చేశారు. దిగుమతులను పెంచడానికి కాఫీపై సుంకాలను తగ్గిస్తామని వారి ప్రారంభంలోనే ట్రంప్ పరోక్షంగా చెప్పారు.
అమెరికాలో పశువు మంద బాగా తగ్గిపోయింది. దీని కారణంగా గొడ్డు మాంసం ధర బాగా పెరిగిపోయింది. దీని ప్రధాన ఎగుమతిదారు బ్రెజిల్ పై ట్రంప్ విధించిన సుంకాలు గొడ్డు మాంసం కొరతను తీవ్రతరం చేయడమే కాక.. ధర పెరిగేలా చేసింది. అమెరికాలో ఉత్పత్తి చేయని వస్తువుల ధరలను తగ్గించే లక్ష్యంతో గురువారం అనేక లాటిన్ అమెరికన్ దేశాలతో ఒప్పందాలను ప్రకటించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకాల ఉప సంహరణ ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: