📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: USA: ఇక అమెరికన్ పౌరుడికి 2వేల డాలర్లు.. ట్రంప్ ఆఫర్

Author Icon By Rajitha
Updated: November 10, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఎంపికైన దగ్గర నుంచి సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అధిక టారిఫ్ లతో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నారు. ఎవరు ఎంత చెబుతున్నా తగ్గేదేలేదు అన్నట్లు టారిఫ్ లపై కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీంతో ట్రేడ్ వార్ కు తెరదీశారు. ప్రత్యేకంగా చైనా, రష్యా, భారత్ దేశాలతో ట్రంప్ విధించిన టారిఫ్ ల విషయంలో దేశాలమధ్య స్నేహసంబంధాలు దెబ్బతింటున్నాయి. అయినా ట్రంప్ వెనుకడుగు వేయడం లేదు. అయితే ట్రంప్ ఓ బంపర్ఆఫర్ ను ప్రకటించారు. అగ్రరాజ్య పౌరులకు టారిఫ్ ల ద్వారా వసూలు చేసిన ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ పౌరుడికి ఏటా 2,000డాలర్ల చొప్పున ‘డివిడెండ్ లు’ అందిస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.

Read also: Kalmaegi Typhoon: ఫిలిప్పీన్స్‌ లో తుఫాను..224కు చేరిన మృతుల సంఖ్య

USA: ఇక అమెరికన్ పౌరుడికి 2వేల డాలర్లు..

సుంకాలే లేకపోతే అమెరికా పూర్తిగా నాశనమవుతుంది

సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘టారిఫ్ లకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు అని.. సుంకాలే లేకపోతే అమెరికా పూర్తిగా నాశనమవుతుంది’ అని టారిఫ్ లను ట్రంప్ దైన శైలిలో సమర్థించుకున్నారు. టారిఫ్ ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని, రికార్డుస్థాయి స్టాక్ధరలు, 401(కె) బ్యాలెన్స్ లు పెరిగాయని, దేశవ్యాప్తంగా కొత్త కర్మాగారాలు వెలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సుంకాలతోనే అమెరికా ధనిక దేశంగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్స్ పై అమెరికా అత్యున్నత కోర్టు సీరియస్ అయిన విషయం విధితమే. అధ్యక్షుడి అధికారాలపై ఫెడరల్ కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింంది.

ఆదాయంలో కొంత భాగం సాధారణ ప్రజలకు..

ట్రంప్ ప్రతిపాదన ప్రకారం, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం విధించే సుంకాల ద్వారా వస్తున్న భారీ ఆదాయం నుంచి ఈ డివిడెండ్ లను చెల్లిస్తారు. ఈ టారిఫ్ లు ‘ట్రిలియన్ల కొద్దీ డాలర్లను’ దేశంలోకి తీసుకువస్తున్నాయని ట్రంప్ వాదించారు. ఈ ఆదాయంలో కొంత భాగాన్ని సాధారణ ప్రజలకు పంపిణీ చేయడమే కాకుండా, దేశ జాతీయ రుణాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ట్రంప్ ఈ విధానాన్ని సమర్థిస్తూ, పన్నులు విధించడం కంబే టారిఫ్ లు విధించడమే ఉత్తమమని పేర్కొన్నారు. ‘ఈ టారిఫ్ లను ఇతర దేశాలే చెల్లిస్తాయి, ఆమెరికన్ పౌరులు కాదు’ అని ఆయన పునరుద్ఘాటించారు, ఇది అమెరికన్లకు ఒక పెద్ద విజయమని అభివర్ణించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Donald Trump latest news Telugu News Trade Tariffs US Economy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.