అమెరికా (USA) ఆటోమొబైల్ మార్కెట్లో దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థలు హ్యుందయ్, దాని అనుబంధ సంస్థ కియా సరికొత్త చరిత్ర సృష్టించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో మార్కెట్లలో ఒకటైన అమెరికాలో, ఈ రెండు కంపెనీలు కలిసి ఆల్‌టైమ్ రికార్డు స్థాయి మార్కెట్ వాటాను సాధించాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లను దూకుడుగా పెంచినప్పటికీ, అన్ని సవాళ్లను అధిగమిస్తూ 2025 సంవత్సరంలో హ్యుందయ్, కియా కలిపి 11.3 శాతం మార్కెట్ షేర్‌ను దక్కించుకోవడం విశేషంగా మారింది.
Read Also: US airstrike Syria : సిరియాలో రహస్య దాడి, అమెరికా హతమార్చింది ఎవరు?
స్థానిక ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది
మార్కెట్ రీసెర్చ్ సంస్థ వార్డ్స్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం హ్యుందయ్ 9,84,017 యూనిట్లతో 6.1 శాతం వాటాను, కియా 8,52,155 యూనిట్లతో 5.2 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. దీంతో అమెరికా మార్కెట్లో జనరల్ మోటార్స్ (17.5%), టయోటా (15.5%), ఫోర్డ్ (13.1%) తర్వాత ఈ గ్రూప్ నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం యూఎస్ మార్కెట్ 2.4 శాతం వృద్ధి చెందగా, హ్యుందయ్, కియా అమ్మకాలు 7.5 శాతం పెరగడం విశేషం.
గతేడాది హ్యుందయ్, కియా హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు ఏకంగా 48.8 శాతం పెరిగి 3,31,023 యూనిట్లకు చేరాయి. యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం జార్జియాలో హ్యుందయ్ మూడో ప్లాంట్‌ను పూర్తి చేయడంతో స్థానిక ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. టారిఫ్ భారాన్ని వినియోగదారులపై మోపకుండా కంపెనీయే భరించడం కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడింది. ఈ వ్యూహం కారణంగా దక్షిణ కొరియా నుంచి అమెరికాకు వాహనాల ఎగుమతులు 4.2 శాతం తగ్గాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: