అమెరికా (USA) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండవ సారి ప్రమాణం చేసిన రోజునుంచి పలు కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపి, విదేశీయుల రాకను భారీగా అడ్డుకుంటున్నారు. దీంతో ఆ దేశంలో ప్రధాన కంపెనీలకు ప్రతిభ గల ఉద్యోగులు కరువయ్యారు. ఇదే విషయాన్ని ట్రంప్ బుధవారం అంగీకరించారు.
అమెరికాకు విదేశీ నిపుణుల అవసరం ఉందని చెప్పారు. ఇక నిధుల కేటాయింపులో డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య విభేదాలు రావడంతో నిధుల కొరత ఏర్పడింది. దీంతో గత్యంతరం లేక షట్ డౌన్ నుప్రకటించింది. షట్ డౌన్ వల్ల పలు సంస్థలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నంగా మారిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాను ఊహించలేనంత నష్టాలను చవిచూస్తుందని నిపుణుల హెచ్చరిక వల్ల ఎట్టకేలకు ట్రంప్ దిగొచ్చారు.
Read Also: Srikakulam District Crime: మస్కట్లో ఆముదాలవలస వాసి మృతి
ఫండింగ్ బిల్లుపై ట్రంప్ సంతకం
మొత్తానికి అమెరికా ప్రభుత్వం అధికారికంగా తిరిగి ప్రారంభం అవనుంది. దీనికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ అత్యధిక ఓట్లతో ఆమోదించింది. 222-209 ఓట్లతో తీర్మానాన్ని సెనేట్ పాస్ చేసింది. అధ్యక్షుడు ట్రంప్ మరికాసేపట్లో దీనిపై సంతకం చేయనున్నారు. జనవరి 2026 వరకు ప్రభుత్వ నిధులను ఈ బిల్లు ద్వారా సమకూర్చనున్నారు. దీని ద్వారా చట్టసభ సభ్యులు దీర్ఘకాలిక బడ్జెట్ ఒప్పందంపై చర్చలు జరపడానికి సమయం కూడా దొరకనుంది. ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ కొద్ది సేపటి క్రితం సంతకం చేశారు.
అవసరమైన మెజార్టీ లభించడంతో బిల్లు ఆమోదం
నిధుల బిలులపై చర్చరు ముగించి, తదుపరి పరిశీలనకు తరలించడానికి సెనేట్ లో కనీసం 60ఓట్ల మద్దతు అవసరం. ఈ కీలక ఓటింగ్ లో 8మంది డెమొక్రాటి సెనేటర్లు తమ పార్టీ వైఖరికి భిన్నంగా రిపబ్లికన్లకు మద్దతుగా ఓటు వేశారు. దీంతో బిల్లుకు అవసరమైన మెజార్టీ లభించి, ఆమోదం పొందింది. అయితే, సెనేట్ డెమొక్రాటిక్(Senate Democratic) నేత చక్షుమెర్ సహా పలువురు సీనియర్ డెమొక్రాట్లు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. అఫర్డబుల్ కేర్ యాక్ (ఎసిఎ) కింద ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలను పొడిగించే అంశంపై స్పషటమైన హామీ లేకపోవడమే వారి ఆందోళనకు ప్రధాన కారణం.
సెనేట్ లో చర్చలు జరిగే అవకాశం
ప్రభుత్వం షట్ డౌన్ ముగిసిన తర్వాత దీర్ఘకాలిక బడ్జెట్, అలాగే ఒబామా కేర్ లాంటి వాటిపై సెనేట్ లో చర్చించనున్నారు. జనవరి 2026 వరకు టైమ్ ఉంది కాబట్టి వీటిపై సెనేట్(Senate) పలుసార్లు చర్చలు జరిగే అవకాశం ఉంది.
అలాగే సెనేటర్లు తమ ఎలక్ట్రానిక్ రికార్డులను తమకు తెలియకుండా యాక్సెస్ చేస్తే అమెరికా ప్రభుత్వంపై 500,000 వరకు దావా వేయడానికి అనుమతించడం అనే బిల్లుపై అనేకమంది హౌస్ రిపబ్లికన్ల నుండి విమర్శలను ఎదుర్కొంది. ప్రభుత్వం పూర్తిగా తిరిగి తెరిచిన తర్వాత ఆ నిబంధనను రద్దు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికలను జిపిఒ సభ్యులు ఇప్పటికే సంకేతాలిచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: