📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: USA: గాజా శాంతి ప్రణాళిక ముసాయిదాపై భద్రతా మండలి ఆమోదం

Author Icon By Sushmitha
Updated: November 18, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

USA రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్, (Israel) హమాస్ లమధ్య జరిగిన యుద్ధం ట్రంప్ చొరవతో ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాలు తమ బందీలను విడుదల చేసుకున్నాయి. అయినా ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై (Gaza) దాడులకు పాల్పడుతూనే ఉంది. అయితే తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా కోసం 20 అంశాల శాంతి ప్రణాళిక రూపొందించారు. అమెరికా రూపొందించిన ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం ఆమోదించింది. ఈ ప్రతిపాదనను అంతర్జాతీయ ఆమోదం లభించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 13 ఓట్లు వచ్చాయి. అయితే రష్యా, చైనాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. 

Read Also: FakeMessage Alert: SBI YONO బ్లాక్ అవుతుందంటూ నకిలీ మెసేజ్‌లు

USA: Security Council approves draft Gaza peace plan

దీంతో గాజాలో అంతర్జాతీయ స్థిరీకరణ దళం లేదా ఐఎస్ ఎఫ్ ఏర్పాటుకు అధికారం వస్తుంది. దీని గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ..ఐఎస్ ఎఫ్ లో చేరడానికి సుముఖత వ్యక్తం చేశాయని తెలిపారు. ఈ దళం గాజాలోకి ప్రవేశించడం, సైనికీకరణను నిరాయుధీకరణ చేయడం, కీలక ప్రాంతాలను భద్రపరచడం, మానవతా సహాయం అందించడంలో మద్దతు ఇవ్వడం వంటి పనులను చేస్తుంది. ఇది ఇజ్రాయెల్, ఈజిప్టుతో తన కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది.

ఐరాస హమాస్ ప్రతిపాదన తిరస్కరణ

ఐక్యరాజ్యసమితి హమాస్ (Hamas) ప్రతిపాదనను తిరస్కరించింది. వారి ప్రతిపాదనలో పాలస్తీనియన్ల హక్కును ప్రస్తావించలేదని, అలాగే గాజాపై హమాస్ అధికారాన్ని చెబుతోందని యూఎస్ వ్యాఖ్యానించింది. ట్రంప్ (Trump) ప్రతిపాదన ప్రకారం హమాస్ సహా ‘రాష్టేతర సాయుధ సమూహాల నుండి ఆయుధాలను శాశ్వతంగా తొలగించడంపై ఐఎస్ ఎఫ్ పనిచేస్తుందని ముసాయిదా తీర్మాణం పేర్కొన్నది.

ఈ సమూహాలు తమ ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుంది. గాజాలో పోలీసింగ్ బాధ్యతలను చేపట్టడానికి ప్రస్తుతం అమలులో ఉన్న హమాస్ నడిపే దళాన్ని భర్తీ చేయడానికి కొత్తగా శిక్షణ పొందిన పాలస్తీనా పోలీసు దళాన్ని సృష్టించాలని కూడా ముసాయిదా కోరుతోంది. ఇజ్రాయెల్ దాడితో గాజా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ప్రజల జీవనవిధానం పూర్తిగా అడుగట్టి పోయింది. ఎట్టకేలకు ట్రంప్ చొరవతో ప్రస్తుతం గాజాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

ceasefire efforts. Gaza peace plan Google News in Telugu international diplomacy; Latest News in Telugu Middle East conflict; resolution approved Telugu News Today UN Security Council

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.