📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: USA : భారతీయులకు ఊరటనిచ్చే కొత్త టారిఫ్స్ 

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సొంతదేశంలో వస్తున్న ఫిర్యాదులు అలాగే ఆహార కొరత కారణంగా ట్రంప్ కొన్ని ఆహార ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్ తగ్గిస్తూ ఆయన సంతకం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని అమెరికన్లు (USA) వరుసగా ఫిర్యాదులు చేస్తుండడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కారణంగా అమెరికాలోని కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనుండడంతో పాటు ఇండియాకు కూడా కొంత మేలు చేకూరే అవకాశం ఉంది.

Read Also: Tirumala : పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలపై తర్జన భర్జనలు

USA

ప్రజల నుంచి విమర్శలతో ట్రంప్ వెనుకడు..

భారత్ తో పాటు పలు ఇతర దేశాల దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించడం, భారత్ పై ఇంకా అదనంగా మరో 25 శాతం టారిఫ్ భారాన్ని మోపిన విషయం తెలిసిందే. అయితే ఈ సుంకాల కారణంగా అమెరికాలో కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. దాంతో అక్కడి ప్రజలు పెద్దమొత్తంలో కంప్లెయింట్స్ చేశారు. 

దీంతోపాటు అక్కడి డెమొక్రటిక్ పార్టీ (Democratic Party) కూడా దీనిపై విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ కారణంగా ట్రంప్ టారిఫ్ లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త టారిఫ్ రూల్స్ ప్రకారం ట్రాపికల్ పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, కోకో గింజలు, నారింజ, టోమాటో, బీఫ్ వంటి వాటిపై భారీగా టారిఫ్ తగ్గనుంది. ఇది భారతీయ రైతులకు కొంత మేలు చేకూరుతుంది.

భారత్ కు కలిసొచ్చే అంశాలు

భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల్లో మామిడి పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో 2006లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ మామిడి పండ్లపై నిషేధాన్నిఎత్తవేయగా, ప్రధాని మోదీ ఇటీవల పర్యటన సందర్భంగా ట్రంప్, (Trump) మోదీల ప్రకటనలో కూడా మామిడి, దానిమ్మ ఎగుమతుల ప్రస్తావన వచ్చింది. అలాగే గతంలో జనరిక్ ఔషధాలకు టారిఫ్ మినహాయింపు ఇవ్వగా, ఇప్పుడు ఆహార ఉత్పత్తులకు కూడ రిలీఫ్ ఇచ్చారు. ఇవన్నీ భారత్ కు కలిసొచ్చే అంశాలే.

పలు దేశాల రైతులకు ఊరట

అమెరికా గొడ్డు మాంసం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. గొడ్డుమాంసం ధర పెరగడానికి ట్రంప్ బ్రెజిల్ పై విధించిన టారిఫ్ (tariff) కారణమని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. బ్రెజిల్ పై భారీ ఎత్తున టారిఫ్ లు వేయడంతో.. అమెరికా మార్కెట్లో బీఫ్ సరఫరా తగ్గింది. దాంతో ధరలు భారీగా పెరిగిపోయాయి.

తద్వారా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా ధరలను తగ్గించే దిశగా ట్రంప్ టారిఫ్ లను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేవలం బీఫ్ మీదే కాకుండా టీ, కాఫీ, ఫ్రైట్స్, స్పైసెస్, టొమాటో వంటి రోజువారీ వస్తువులపై కూడా టారిఫ్ లు తగ్గాయి. దీనివల్ల ఇండియా సహా పలు దేశాల్లోని రైతులకు కొంత ఊరట లభించినట్టయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

economic policy; Google News in Telugu import duties; India trade relief Latest News in Telugu Telugu News Today trump US Tariffs US-India relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.