USA: బర్గర్ తినడంతో వ్యక్తి మృతి… అరుదైన ‘ఆల్ఫా గాల్ సిండ్రోమ్’ కేసు

Read Time:  1 min
USA
USA
FONT SIZE
GET APP

బీఫ్ బర్గర్ తిన్న తర్వాత అమెరికాలో(USA) ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పురుగు కాటు వల్ల ఏర్పడే అరుదైన ఆల్ఫా గాల్ సిండ్రోమ్ (Alpha-gal Syndrome – AGS) కారణంగానే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఈ పరిస్థితి వల్ల మరణించిన ప్రపంచంలోని మొదటి ఘటనగా వైద్య నిపుణులు ఈ కేసును గుర్తించారు.

Read Also: Google CEO: ఏఐని గుడ్డిగా నమ్మితే మోసపోతారు.. సుందర్ పిచాయ్

USA
USA

47 ఏళ్ల ఈ వ్యక్తికి గతంలో టిక్(USA) అనే చిన్న పురుగు కాటు వేయడంతో గాలక్టోస్ ఆల్ఫా-1,3-గాలక్టోస్ అనే చక్కెర పదార్థానికి అలర్జీ ఏర్పడింది. ఈ చక్కెర బీఫ్ వంటి క్షీరదాల మాంసంలో ఉంటుంది. 2024లో న్యూజెర్సీలోని ఒక రెస్టారెంట్‌లో బీఫ్ బర్గర్ తిన్న అతడు కొన్ని గంటల్లోనే తీవ్రమైన ప్రతిచర్యకు గురై వాంతులు చేయడం ప్రారంభించాడు. అనంతరం అనాఫిలాక్సిస్ అనే అత్యంత ప్రమాదకర అలర్జీ రియాక్షన్‌తో మరణించాడు.

మొదట వైద్యులు ఈ లక్షణాలను గుర్తించలేకపోవడంతో పోస్ట్‌మార్టంలో దీన్ని ఆకస్మిక మరణంగా నమోదు చేశారు. అయితే తరువాత వర్జీనియా యూవీఏ హెల్త్ పరిశోధకులు ఈ కేసును లోతుగా పరిశీలించి, ఇది ఆల్ఫా గాల్ సిండ్రోమ్ కారణంగా జరిగిన మరణమనే విషయాన్ని వెల్లడించారు. వారి నివేదిక ప్రసిద్ధ జర్నల్ ఆఫ్ అలెర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ: ఇన్ ప్రాక్టీస్ పత్రికలో ప్రచురితమైంది.

ఈ సిండ్రోమ్‌కు చికిత్స ఉందా?

ప్రస్తుతం ఆల్ఫా గాల్ సిండ్రోమ్‌కు ప్రత్యక్ష చికిత్స లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఉన్నవారు:

  • క్షీరదాల మాంసం (ప్రత్యేకంగా బీఫ్)
  • బీఫ్ ఉత్పత్తులు
  • సంబంధిత జెలటిన్ పదార్థాలను

కఠినంగా నివారించాల్సి ఉంటుంది.

అలర్జీ ఉందనే అనుమానం ఉన్నవారు పరీక్ష చేయించుకోవడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.