డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య ఏర్పడిన విభేదాలు షట్ డౌన్ కు దారితీసింది. దీంతో 40 రోజులుగా ఆమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ ఏర్పడింది. అయితే నేడు జరిగిన సెనెట్ ఓటింగ్ లో రెండు పార్టీలు ఏకాభిపాయానికి వచ్చాయి. కొందరు డెమోక్రాట్లు కూడా అనుకూలంగా ఓటు వేయడంతో 40 రోజులపాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా ప్రభుత్వానికి నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, (Donald trump) కాంగ్రెస్ కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మొదలైన షట్ డౌన్ ఆదివారం నాటికి 40వ రోజుకు చేరుకుంది.
Read also: RSS: భారత్ కు హాని చేయడమే పాక్ లక్ష్యం: మోహన్ భగవత్
USA: ముగింపు దిశగా అమెరికా షట్ డౌన్ !
ప్రతిష్టంభనను తొలగించేందుకు కీలక సమావేశం
దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలగడంతో ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి సెనెటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షట్ డౌన్ ముగించే దిశగా తొలిఅడుగు పడింది. ట్రంప్, రిపబ్లికన్లు ప్రతిపాదించిన ఓ డీల్ కు కొందరు డెమోక్రాట్లు సానుకూలంగా స్పందించారు. చివరి నిమిషంలో టెక్సాస్ సెనెటర్ జాన్ కార్నిన్ ఓటుతో తీర్మానానికి అనుకూలంగా 60 ఓట్లు వచ్చాయి. సెనెట్ లో రిపబ్లికన్ సభ్యుల సంఖ్య 53 కాగా.. డెమోక్రాట్ల సంఖ్య 45, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. అక్కడ బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు రావాలి. ఇప్పుడు ఎనిమిది మంది డెమోక్రాట్లు మద్దతు ఇవ్వడంతో ఈ సమస్య ఓ పరిష్కారంకు కు వచ్చినట్లుగా అయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: