📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: USA: ట్రంప్ షట్ డౌన్ తో సంక్షోభంలో విమానాశ్రయం

Author Icon By Tejaswini Y
Updated: November 8, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెయ్యికిపైగా విమానాలు రద్దు

అమెరికాలో(USA) షట్ డౌన్ కారణంగా విమానయాల రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. వెయ్యికిపైగా విమానాల సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ప్రయాణికులు అంటున్నారు. ఎయిర్ ట్రాఫిక్కం ట్రటోలర్స్ పై ఒత్తిడి తగ్గించడానికి విమాన సేవల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి.

షట్ డౌన్ కారణంగా విమాన సేవల్లోకొత విధించినట్లు దేశ రవాణాశాఖ మంత్రి సీన్ డఫీ ప్రకటించారు. దీని ప్రకారం దేశంలోని రద్దీ ఎక్కువగా ఉండే 40 ప్రాంతాల్లో 10శాతం విమాన సర్వీసులను రద్దు చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ఆదేశించింది. దీనిని శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణాశాఖ మంత్రి సీన్ డఫీ పేర్కొన్నారు. పరిస్థితి మరింత అదుపుతప్పితే అదనపు ఆంక్షలు విధిస్తామని మంత్రి డఫీ వెల్లడించారు.

Read Also: IND vs AUS: ఐదో టీ20కి వర్షం అంతరాయం

ప్రజల భద్రత కోసమే ఈ నిర్ణయం: సీన్ డఫీ

ఇది ప్రజల భద్రత కోసం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. షట్ డౌన్ ముగిస్తే పరిస్థితి మెరుగవుతుందని అన్నారు. శుక్రవారం ఒక్కరోజు వెయ్యికి పైగా విమానాలు రద్దు అయ్యాయని ప్లైట్ అవేర్ వెబ్ సైట్ వెల్లడించింది. ఇది గురువారం కంటే ఐదురెట్లు ఎక్కువ అని తెలిపింది. రేగన్ జాతీయ విమానాశ్రయంపై దీని ప్రభావం ఎక్కువగా పడింది. 18శాతం అంటే 81 విమానాలు రద్దయ్యాయి. షికాగో ఓ పేర్, అట్లాంటా, డల్లాస్, డెన్వర్ వంటి కేంద్రాల్లో కూడా 3శాతం
వరకు విమానాలు రద్దయ్యాయి. హ్యూస్టన్ లోని జార్జ్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ పోర్ట్, అట్లాంటా, డల్లాస్, డెన్వర్, చార్లెట్ వంటి ప్రధాన కేంద్రాల్లో పెద్ద ఎత్తున సెక్యూరిటీ లైన్లు కదల్లేకపోవడంతో ప్రయాణికులు నేలపై కూర్చోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ప్రయాణీకులు అంటున్నారు.

ప్రయాణీకులను కీలక సూచనలు

ఎయిర్ లైన్స్ నిపుణులు ప్రయాణికులను శాంతంగా ఉండమని, ప్రత్యామ్నాయ విమానాల వివరాలు ముందుగానే తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మీ ఫ్లైట్ర రద్దయితే, రీఫండ్ హక్కు ఉంటుంది. కానీ భోజనం లేదా హోటల్ ఖర్చులు ఎయిర్ లైన్ పిధిలో ఉండవు అని యుఎస్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ తెలిపింది. యునైటెడ్, అమెరికన్ ఎయిర్ లైన్స్ చాలామంది ప్రయాణికులను రీబుక్ చేయగలిగాయి. డెల్టా 170 విమానాలను, అమెరికన్ రోజుకు 220 విమానాలు, సౌత్వెస్ట్ 120 విమానాలను రద్దు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AirTrafficControl AmericanAirlines Breaking News in Telugu SouthwestAirlines Telugu News online USFlightsCancelled USNews USPolitics USShutdown

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.