ప్రపంచంలోనే అరుదైన ఖనిజాల విషయంలో చైనా(China) పోకడను అమెరికా తప్పుబట్టింది. చైనాలో దొరికే ఈ అరుదైన ఖనిజాలపై అక్కడి ప్రభుత్వం కట్టడి చేస్తోందని, తద్వారా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఈ ధోరణిని అమెరికా సహించబోదని ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్(Minister Scott Besant) స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనాను ఎదుర్కోవాలంటే తమకు భారత్ సహాయం కావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతుల వ్యవహారంలో భారత్‌పై అమెరికా భారీగా పన్నులు విధించినప్పటికీ, చైనా విషయంలో మాత్రం భారత్ తమకు సహాయం చేయాలని అమెరికా కోరడం గమనార్హం.
Read Also: Smriti Irani: దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్
ఖనిజాల ఎగుమతిపై చైనా నియంత్రణ
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇటీవల ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రపంచంలో మరెక్కడా లభించని అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఇటీవల నియంత్రణ విధించిందని చెప్పారు. విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే చైనా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే షరతు విధించిందని అన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని బీజింగ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా గురి
“ఇది చైనాకు, ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టింది” అని ఆయన మండిపడ్డారు. బీజింగ్ దూకుడును అమెరికా(America) అడ్డుకుంటుందన్నారు. ఇందుకోసం భారత్‌తో పాటు ఐరోపా దేశాల మద్దతు కూడా తమకు కావాలని ఆయన వెల్లడించారు. అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే, చైనా మాత్రం ఆర్థిక యుద్ధం చేస్తోందని స్కాట్ బెసెంట్ దుయ్యబట్టారు.
చైనాపై అమెరికా ఆర్థిక మంత్రి చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటి?
అరుదైన ఖనిజాల ఎగుమతిపై నియంత్రణ విధించడం ద్వారా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
చైనాను ఎదుర్కోవడానికి అమెరికా ఏ దేశాల సహాయం కోరింది? జ: భారత్ మరియు ఐరోపా దేశాల మద్దతు కావాలని అమెరికా కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: