📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Visa: వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు: అమెరికా హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: August 5, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా వీసా(America Visa) హోల్డర్లకు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలోని భారత పౌరులు(Indian Citizens) అక్కడి వీసా నిబంధనలు గౌరవించాలని సూచించింది. వీసాలో పేర్కొన్న అధికారిక గడువు తరువాత దేశంలో ఉండటం నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎక్స్ వేదికగా హెచ్చరించింది. ఒకవైపు ఇరు దేశాల మధ్య టారిఫ్​(Tariff)ల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్​లోని అమెరికా ఎంబసీ ఈ రకంగా హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థులు, ఉద్యోగులుగా వెళ్లిన వారు తమ మంజూరైన గడువును గౌరవించకపోతే, అమెరికాలో శాశ్వతంగా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంబసీ హెచ్చరించింది. అమెరికాలో వీసా దుర్వినియోగాన్ని అరికట్టే ప్రణాళికలో భాగంగా ఈ ప్రకటన చేసినట్లు యూఎస్ చెబుతోంది.

Visa: వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు: అమెరికా హెచ్చరిక

“మీ వీసా నిబంధనలను గౌరవించండి. చట్టబద్ధ గడువు( I-94 Admit Until Date‌) మించిపోతే వీసా రద్దు, డిపోర్టేషన్, భవిష్యత్తులో వీసా పొందే అర్హతలను కోల్పోవచ్చు. తద్వారా మీరు తిరిగి అమెరికాకు ప్రయాణించడం, చదవడం, పనిచేయడం వంటి అవకాశాలను శాశ్వతంగా కోల్పోతారు” అని భారత్ లోని అమెరికా ఎంబసీ పేర్కొంది.

భారతీయుల ఆధిక్యతపై విమర్శలు

అయితే దిల్లీలోని అమెరికా ఎంబసీ ట్వీట్ చేసిన కాసేపటికే జార్జియా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ భారతీయ H1-B వీసాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవలి అమెరికాలో H1-B వీసాలపై, ముఖ్యంగా భారతీయుల ఆధిక్యతపై రాజకీయంగా విమర్శలు పెరుగుతున్నాయి. “భారతీయ H1-B వీసాలను ఆపండి. ఇవి అమెరికన్ ఉద్యోగాలను దోచుకుంటున్నాయి. అలాగే ఒబామా/బైడెన్/నియోకాన్ ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి నిధులు, ఆయుధాలను పంపడం ఆపండి” అని మార్జోరీ టేలర్ గ్రీన్ ట్వీట్ చేశారు.
ఇండియా అమెరికా మధ్య సుంకాల ఉద్రిక్తతలు
ఇండియా అమెరికా మధ్య ఇప్పటికే సుంకాల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్​పై భారీగా సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇదే సమయంలో భారత్​లోని అమెరికా ఎంబసీ హెచ్చరికలు చేయడం, అనంతరం భారతీయ హెచ్1 బీ వీసాలకు వ్యతిరేకంగా ఆ దేశ కాంగ్రెస్ సభ్యురాలు ట్వీట్ చేయడం, ఈ వరుస పరిణామాలు రెండు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ టారిఫ్ హెచ్చరిక
ఈ వీసా హెచ్చరికలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్ పెంపు హెచ్చరిక జారీ చేశారు. “భారతదేశం భారీగా రష్యా చమురు కొనుగోలు చేసి, దాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో లాభాల కోసం విక్రయిస్తోంది. ఉక్రెయిన్‌లో మరణిస్తున్న ప్రజల గురించి వారికి బాధలేదు. అందుకే భారత్‌ అమెరికాకు చెల్లించాల్సిన టారిఫ్‌ను భారీగా పెంచతాను” అని ట్రంప్ తెలిపారు .

US వీసాలు ఎన్ని రకాలు?
US వీసాలలో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి: వలసేతర వీసాలు - తాత్కాలిక ప్రాతిపదికన యునైటెడ్ స్టేట్స్‌కు ప్రయాణించడానికి. మరింత తెలుసుకోండి. వలస వీసాలు - యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వతంగా నివసించడానికి ప్రయాణించడానికి.
US వీసా ఎంతకాలం చెల్లుతుంది?
మీరు USలో ఎంతకాలం ఉండగలరు? వీసా చెల్లుబాటు vs. వ్యవధి ...
భారతీయ పౌరులకు US వీసా యొక్క చెల్లుబాటు వీసా రకాన్ని బట్టి ఉంటుంది. టూరిస్ట్ (B-1/B-2) వీసాలు సాధారణంగా బహుళ ఎంట్రీలతో 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతాయి, ప్రతి సందర్శనకు ఆరు నెలల వరకు బస చేయడానికి అనుమతిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/love-marriage-social-issues-village-rejection/national/526259/

Immigration Law International Students Telugu News Travel Advisory US Government Warning US Immigration US visa rules Visa Policy Visa Violation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.