📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

US VISA: యూఎస్ వెళ్లాలనుకునే వారికి ట్రంప్ బిగ్ షాక్

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉద్యోగ (హెచ్‌-1బీ)(H-1), విద్యార్థి (ఎఫ్‌/ఎం)(Student F/M), పర్యాటక/వ్యాపార (బీ-1, బీ2)(Tourist B1,B2), ఎక్స్చేంజ్‌ (జే)…ఏదైనా వీసా అయినా సరే…అమెరికా(America) వెళ్ళాలనుకుంటే ఇక మీదట ఎక్కువ ఫీజులు చెల్లించాల్సిందే. వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింద అదనంగా 250 డాలర్లు చెల్లించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాలపై అమెరికాకు వచ్చేవారు అక్రమంగా ఉండిపోకుండా, వీసా కాలానికి మించి ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా అమలు చేసిన వన్ బిగ్ బ్యూటిపుల్ చట్టం(One Big Beautiful Law) కింద ఈ వీసా ఫీజులు కూడా అమలు కానున్నాయి. అంతే కాదు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ ఫీజుల్లో మార్పులు చోటు కూడా చేసుకుంటాయి.

యూఎస్ వెళ్లాలనుకునే వారికి ట్రంప్ బిగ్ షాక్

తడిసిమోపెడవనున్న వీసా ఛార్జీలు..
వీసా జారీ చేసేటప్పుడే ఈ అధిక రుసుమును అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఈ రుసుమును సర్‌చార్జ్‌ రూపంలో వసూలు చేస్తుంది. దీంతోపాటు.. ఐ-94 సర్‌చార్జ్‌ 24 డాలర్లు, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ ఫర్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్‌ ఈఎస్ టీఏ- 13 డాలర్లు, ఎలక్ట్రానిక్‌ వీసా అప్‌డేట్‌ సిస్టమ్‌ ఈవీయూఎస్‌-30 డాలర్లు కింద అదనపు రుసుములను వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో పొందుపరిచారు. ఇవన్నీ కలిపి ప్రస్తుతం వీసా ఫీజులు భారంగా మారనున్నాయి. ఇప్పటి వరకు అమెరికాకు పర్యాటక/వ్యాపార వీసాపై వెళ్లాలంటే వీసా చార్జీలుగా 185 డాలర్లు వసూలు చేస్తున్నారు. అంటే దాదాపుగా రూ.15,855. బిగ్‌ బ్యూటిఫుల్‌ యాక్ట్‌లో ప్రతిపాదించిన ఇతర చార్జీలను, ఇంటెగ్రిటీ రుసుమును కూడా కలుపుకొంటే ఇప్పుడు అది ఏకంగా 472 డాలర్లకు అంటే రూ.40,456 గా అవనుంది .

US వీసాతో ఎన్ని దేశాలను సందర్శించవచ్చు?
US వీసా, ప్రత్యేకంగా బహుళ-ప్రవేశ B1/B2 వీసా, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రత్యేక వీసా అవసరం లేకుండా అనేక ఇతర దేశాలలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. ఈ దేశాలలో కరేబియన్, మధ్య మరియు దక్షిణ అమెరికా మరియు తూర్పు ఐరోపాలోని దేశాలు ఉన్నాయి.
B1 మరియు B2 వీసాలు అంటే ఏమిటి?
B1 మరియు B2 వీసాల మధ్య తేడా ఏమిటి?
B1 మరియు B2 వీసాలు తాత్కాలిక బసల కోసం యునైటెడ్ స్టేట్స్ జారీ చేసిన వలసేతర వీసాలు. B1 వీసా వ్యాపార ప్రయోజనాల కోసం, అయితే B2 వీసా పర్యాటకం, వినోదం లేదా వైద్య చికిత్స కోసం. అవి తరచుగా కలిపి B1/B2 వీసాగా జారీ చేయబడతాయి, ఇది వ్యాపారం మరియు విశ్రాంతి ప్రయాణాలకు అనుమతిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

#telugu News H1B visa news Trump 2025 policy Trump immigration policy Trump on immigration US travel restrictions US visa for Indians US visa rules US visa shock

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.