అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచే విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా వలసవాదులనై తన ఉక్కుపాదాన్ని మోపి, వారి రాకను ఆపడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు. తాజాగా హెచ్ 1వీసా(H1 visa)కులక్ష డార్లు (రూ.88లక్షలు) పెట్టడంతో ఒక కొత్తగా చదువుకునే విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసినట్లుగా ఉంది. అమెరికా యూనివర్సిటీలపై విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపరని అధికారులు భావిస్తున్నారు.
Read also: Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. వందల్లో మృతి
నాలుగేళ్ల వీసా వ్యవధి ఫిక్స్
ఎఫ్-1 వీసాపై అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు, జే-1 వీసా కలిగిన ఎక్ఛేంజ్విజటర్ల ‘డ్యురేషన్ ఆఫ్ స్టేటస్’ను మారుస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డిహెచ్ఎస్) ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కోర్సు కాలంతో సంబంధం లేకుండా అందరికీ నాలుగేళ్ల వీసా వ్యవధిని ఫిక్స్ చేసింది. దీన్ని అమెరికా ఉన్నత విద్యాసంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా ఉన్నత విద్యాసంస్థల అసోషియేషన్ అమెరికన్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ తో పాటు మరో 53 సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ట్రంప్ నిర్ణయంతో అయోమయంలో విద్యార్థులు
కొత్త నిబంధనలు తప్పుల తడకగా ఉన్నాయని అమెరికా ఉన్నత విద్యాసంస్థల సంఘాలు(Educational institutions associations) ఆరోపిస్తున్నాయి. ట్రంప్ నియమించిన నియమాలు అమలైతే అంతర్జాతీయ విద్యార్థులు అవకాశాలు కోల్పోతారని, వారు అమెరికా యూనివర్సిటీలను ఎంచుకోకుండా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాజాగా ఈ సంఘలన్నీ కొత్త నిబంధనలను ట్రంప్ వెనక్కు తీసుకోవాలని డిహెచ్ఎస్ ను కోరుతున్నాయి.
గ్రేస్ పీరియడ్ 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గింపు
కోర్సుతో కాలంలో సంబంధం లేకుండా అందరికీ అత్యధికగా నాలుగేళ్ల గడువును విధించారు. వేరే కాలేజీ లేదా కోర్సుకు మారాలన్న కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. గ్రేస్ పీరియడ్ ను కూడా 60 నుంచి 30రోజులకు తగ్గించారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ పై 24 నెలల పరిమితి విధించారు. నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టే కోర్సులు (పీహెచ్సీ జాయింట్ డిగ్రీ, మెడికల్ రెసిడెన్సీ) తీసుకుంటే… కచ్చితంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ కు దరఖాస్తు చేసుకోవాలి. వీటివల్ల ఎక్కువ సమయం వృథా అవడమే కాకుండా ప్రభుత్వంపై భారం పడుతుంది. విద్యార్థుల చదువుకు కూడా అడ్డంకులు ఎదురవుతాయి.
అమెరికా కొత్త వీసా నిబంధనల్లో ప్రధాన మార్పులు ఏమిటి?
ఎఫ్-1 వీసా (విద్యార్థులు), జే-1 వీసా (ఎక్స్ఛేంజ్ విజిటర్లు) కోసం ‘డ్యురేషన్ ఆఫ్ స్టేటస్’ను రద్దు చేసి, గరిష్టంగా నాలుగేళ్ల వీసా గడువును ఫిక్స్ చేశారు.
గ్రేస్ పీరియడ్‌లో ఏ మార్పులు చేశారు?
విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక ఉండే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: