అమెరికా(US) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. అక్రమ వలసదారులను బలవంతంగా అమెరికా నుంచి పంపించివేయడమే కాక వారిని అరెస్టు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. అంతేకాక విదేశీయుల రాకను భారీసంఖ్య తగ్గించే యుద్ధప్రాతిపదిక\ చర్యలకు దిగారు. తాజాగా హెచ్-1బీ దుర్వినియోగం వల్ల అమెరికా ఉద్యోగాలనీ విదేశీ కార్మికులతో నిండిపోతున్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కార్మికశాఖ సెప్టెంబరులో ప్రాజెక్టు ఫైర్ వాల్ ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ లో భాగంగా ఈ వీసా అవకతవకలపై కార్మికశాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు వీసా దుర్వినియోగంపై 175 కేసులు నమోదు చేసినట్లు అమెరికా మీడియా సంస్థ ప్రచురించిన కథనంలో పేరొ ఉంది.
ట్రంప్ ప్రాజెక్ట్ ఫైర్ వాల్
వీసా దుర్వినియోగాన్ని అరికట్టడానికి హెచ్ -1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికశాఖ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ను ప్రారంభించారు. అమెరికన్ యువతకు దక్కాలసిన ఉద్యోగాలను తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికులతో కంపెనీలు ఉద్యోగాలు భర్తీ చేయకుండా చూడటమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అలా ఎక్కడైనా దుర్వినియోగం జరిగినట్లు తేలితే లేబర్ విభాగం ఆడిట్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తున్నామని ఆ శాఖమంత్రి లోరి చావెజ్ తెలిపారు. అధ్యక్షుడి నాయకత్వంలో అధిక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగాలు మొదట అమెరికా కార్మికులకే వెళ్లేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.
భారీగా ఊడిపోతున్న ఉద్యోగాలు
ఇందులో భాగంగా ఇటీవల కార్మికశాఖ ఒక ఒక వీడియోను రూపొందించింది. ‘హెచ్-1బీ’ దుర్వినియోగం కారణంగా విదేశీ కార్మికులతో ఉద్యోగాలు నిండిపోతున్నాయి. యువ అమెరికన్ల అమెరికా డ్రీమ్ చోరీకి గురవుతోందని.. లేబర్ విభాగం నాయకత్వంలో వీసాను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో వారినే జవాబుదారీ చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. హెచ్-1బీల్లో 72శాతం భారతీయులకే వె ళ్తున్నాయని వీడియోలోని ఓ గ్రాఫ్ లో చూపిస్తూ, తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికాకు(US) బదులుగా ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టిని సారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: