📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

US: అధిక సుంకాలతో అమెరికాకే డ్యామేజ్ తో దిగొచ్చిన ట్రంప్

Author Icon By Tejaswini Y
Updated: November 21, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్–అమెరికా(US) మధ్య ట్రేడ్ డీల్ త్వరలోనే కుదరొచ్చని అమెరికా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందం దిశగా రెండు దేశాలు మళ్లీ అడుగు వేయడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి? అమెరికా భారత ఆర్థిక శక్తిని తక్కువ అంచనా వేసిందా? అనేదానిపై ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం. అమెరికా ఊహించినదానికంటే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా నిలిచింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌లు భారత ఎగుమతులను గణనీయంగా దెబ్బతీయలేపోయినా, అవి అమెరికా మార్కెట్‌పైనా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

Read Also: Chittur: AP ప్రజలకు శుభవార్త.. జనవరి నుంచి సంజీవని పథకం అమలు

పలు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడి, అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సుంకాల ప్రభావం కొంతమేర భారత్‌పైనా పడింది. ఈ పరిస్థితుల్లో రెండు దేశాలు మళ్లీ వాణిజ్య సహకారం వైపు కదిలాయి.

US Trump inflicts damage on America with high tariffs

ట్రంప్ సుంకాలు అమల్లోకి వచ్చిన తొలి నెల

అమెరికా భారతీయ దిగుమతులపై 50% వరకు టారిఫ్‌లు విధించినప్పటికీ, ఆశించినంతగా భారత ఎగుమతులు తగ్గలేదు. ట్రంప్ సుంకాలు అమల్లోకి వచ్చిన తొలి నెల సెప్టెంబర్‌లో 12% తగ్గుదల కనిపించినా, అక్టోబర్‌లో మాత్రం తగ్గుదల 8.6%కే పరిమితమైంది. జపాన్, దక్షిణ కొరియా వంటి పలుదేశాలు ఇప్పటికే అమెరికాతో సుంకాలు తగ్గించే ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, భారత్ మాత్రం “వెయిట్ & సీ”(Wait & See) వ్యూహాన్ని అనుసరించింది. వస్త్ర రంగం వంటి కొన్ని విభాగాలు ప్రభావితమయ్యినా, మొత్తం ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు.

భారత్‌ అనుసరించిన ఈ వ్యూహం ఫలించింది అనిపిస్తోంది. రష్యా చమురు దిగుమతులపై విధించిన 25% సుంకాలను అమెరికా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం టారిఫ్‌లు 15% వరకు తగ్గవచ్చని సమాచారం. దీనికితోడు, వ్యవసాయం వంటి సున్నిత రంగాలకు రక్షణ కల్పిస్తూ, సుమారు 80% వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గించేందుకు భారత్‌ కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

India export policy India-US Relations India-US trade deal Trade Negotiations Trump tariff impact US economic strategy US tariffs India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.