📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US Troops : ఇరాక్‌ నుంచి అమెరికా బలగాల పూర్తి నిష్క్రమణ

Author Icon By Vanipushpa
Updated: October 1, 2026 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

US Troops : ఇరాక్‌ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయింది. బాగ్దాద్‌, వాషింగ్టన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఉత్తర ఇరాక్‌లోని చివరి వైమానిక స్థావరం నుంచి కూడా అమెరికా సైనికులు వెనుదిరిగారు. సెప్టెంబర్‌ 30 గడువులోగా ఈ ప్రక్రియ పూర్తయినట్లు అమెరికా ప్రకటించింది. ఇకపై ఇరాక్‌ (Iran) భద్రతా వ్యవహారాల్లో ఆ దేశ సైన్యమే ప్రధాన బాధ్యతలు నిర్వహించనుంది. ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాద సంస్థను ఎదుర్కొనేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాక్‌లో సుమారు 12 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహించాయి. ఐసిస్‌ను వ్యవస్థీకృత సైనిక ముప్పుగా బలహీనపర్చడంలో తమ మిషన్‌ కీలక పాత్ర పోషించిందని పెంటగాన్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో సైనిక ఉపసంహరణను ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించింది.

Read Also: Benjamin Netanyahu: ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. భారత పైలట్ సాహసానికి ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసలు

US Troops

US Troops :  ఇరాక్‌కు అమెరికా మద్దతు కొనసాగింపు

అమెరికా సైనిక బలగాలు ఇరాక్‌ నుంచి వైదొలిగినప్పటికీ, ఇరుదేశాల మధ్య భద్రతా సహకారం పూర్తిగా ముగియడం లేదు. ఇరాక్‌ భద్రతా దళాలకు శిక్షణ, ఇంటెలిజెన్స్‌ సహకారం వంటి మద్దతును అమెరికా కొనసాగించనుంది. ద్వైపాక్షిక భద్రతా సంబంధాల ద్వారా ఇరాక్‌కు సహకారం అందిస్తామని అమెరికా అధికారులు తెలిపారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఉపసంహరణపై స్పందిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా ఇరాక్‌లో దీర్ఘకాలం చిక్కుకుపోయిందని వ్యాఖ్యానించారు. ఇరాక్‌లో అమెరికా సైనిక ప్రమేయాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ, ఈ అధ్యాయం ఇప్పుడు ముగిసిందని పేర్కొన్నారు. ఐసిస్‌పై సాధించిన విజయానికి ఈ నిష్క్రమణ ఒక సంకేతమని తెలిపారు. అమెరికా దళాలు పూర్తిగా వెనుదిరిగిన నేపథ్యంలో ఇరాక్‌ ప్రభుత్వం భద్రతా చర్యలను పెంచింది. ముఖ్యంగా బాగ్దాద్‌ పరిసర ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించింది. అమెరికా సైన్యం నిష్క్రమణపై పలువురు ఇరాక్‌ ప్రజలు, భద్రతా సిబ్బంది స్పందించారు. పోలీసు వాహనాలను అలంకరించి బాగ్దాద్‌ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Baghdad Donald Trump Google News in Telugu Iraq Iraq Security Iraq War ISIS Islamic State latest world news Middle East Pentagon Telugu News Today Trump On Iraq US Iraq Relations US Military US Troops Withdrawal Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.