📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Travel Ban : 12 దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్

Author Icon By Sudheer
Updated: June 5, 2025 • 8:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump ) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రత, ఉగ్రవాద ముప్పు నుంచి ప్రజలను కాపాడేందుకు అనే పేరుతో 12 దేశాలపై సంపూర్ణ ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించారు. ఈ ట్రావెల్ బ్యాన్‌ జాబితాలో అఫ్గానిస్థాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడానికి అనుమతి లేకుండా చేయాలని నిర్ణయించారు.

దేశాలపై పాక్షికంగా ఆంక్షలు

అలాగే మరికొన్ని దేశాలపై పాక్షికంగా ఆంక్షలు విధించారు. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్కమెనిస్థాన్, వెనెజువెలా దేశాల పౌరులపై కొన్ని రకాల వీసాలపై మాత్రమే నియంత్రణలు విధించనున్నారు. ముఖ్యంగా వీసాల మంజూరు ప్రక్రియపై నియంత్రణలు, విజిట్ మరియు వర్క్ వీసాలకు ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. అమెరికాలో శరణార్థుల పేరుతో ప్రవేశిస్తున్న వారిలో భద్రతా ముప్పు ఉన్నవారిని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

ట్రావెల్ బ్యాన్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ

ఈ ట్రావెల్ బ్యాన్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. మానవ హక్కుల సంస్థలు, కొన్ని దేశాలు అమెరికా చర్యను విమర్శిస్తున్నప్పటికీ, ట్రంప్ పరిపాలన మాత్రం దేశ భద్రతే తమకు ముఖ్యం అని చెబుతోంది. అమెరికాలో వలసదారులపై ఇప్పటికే కఠినమైన విధానాలు అమలవుతున్న నేపథ్యంలో ఈ ట్రావెల్ బ్యాన్ మరింత తీవ్రతరంగా మారింది. అయితే ఇది అంతర్జాతీయ సంబంధాలపై ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Read Also : Jobs : CISFలో 403 ఉద్యోగాలు.. రేపే లాస్ట్

12 countries Google News in Telugu Travel Ban Trump travel ban

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.