📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: America: వీసా కోసం ఆరోగ్య నిబంధనలను కఠినతరం చేసిన యూఎస్

Author Icon By Aanusha
Updated: November 8, 2025 • 9:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) వెళ్లాలనుకునే వారికి కీలకమైన సమాచారం. ఇకపై వీసా పొందడంలో ఆరోగ్య పరిస్థితి ఒక ప్రధాన పాత్ర పోషించనుంది. ముఖ్యంగా మధుమేహం (షుగర్), ఊబకాయం (ఒబేసిటీ) వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అమెరికా వీసా లభించడం మరింత కష్టతరం కానుంది. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా వీసా జారీ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య పరిశీలన (Medical Screening) నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

Android Users: ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు అలెర్ట్

ఈ నూతన నిబంధనల ప్రకారం, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి యొక్క ఆరోగ్య వివరాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. ఇప్పటివరకు ట్యూబర్‌కులోసిస్, హెచ్ఐవీ, లంగ్ ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులు మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్, శ్వాస సమస్యలు, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా చేరాయి.

ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు అమెరికాలోకి ప్రవేశిస్తే, వారి చికిత్స ఖర్చులు ప్రభుత్వానికి భారంగా మారతాయని అధికారులు భావిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ (US Govt) ప్రయోజనాలపై ఆధారపడాల్సి వస్తుందని భావించే వారికి వీసా నిరాకరించే అధికారం అధికారులకు ఉంటుంది. ఇప్పటికే ఒబేసిటీ సమస్యతో సతమతమవుతున్న అమెరికా (America), తమ దేశంపై మరింత ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వృద్ధులకు కూడా వీసా రావడం కష్టమవుతుందని

అయితే, దరఖాస్తుదారులు తమ ఆరోగ్య సంరక్షణ, చికిత్స ఖర్చులను పూర్తిగా తామే భరించగలమని, అందుకు తగినంత ఆర్థిక స్థోమత ఉందని రుజువు చేసుకోగలిగితే వారికి వీసా మంజూరు చేసే విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యుల (డిపెండెంట్లు) ఆరోగ్య పరిస్థితి,

వారికి ఏవైనా తీవ్ర వ్యాధులు లేదా వైకల్యాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తారు. ఈ కొత్త నిబంధనల వల్ల వృద్ధులకు కూడా వీసా రావడం కష్టమవుతుందని, అమెరికాలోకి వలసలను నిరుత్సాహపరిచేందుకే ఈ మార్గదర్శకాలను విస్తృతం చేశారని ఇమిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News Diabetes health issues latest news medical screening Obesity Telugu News US visa rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.