📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest Telugu News: US: అమెరికాలో ఉగ్రకుట్ర భగ్నం.. పాకిస్థాన్ సంతతి వ్యక్తి అరెస్ట్

Author Icon By Vanipushpa
Updated: December 4, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా(America)లో మరో భారీ కాల్పుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. డెలావేర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న పాకిస్థాన్ మూలాలు ఉన్న 25 ఏళ్ల అమెరికన్ పౌరుడు లుఖ్మాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని కారులో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, దాడి ప్రణాళికతో కూడిన ‘మ్యానిఫెస్టో’ లభించాయని యూఎస్ న్యాయ శాఖ ప్రకటించింది.

Read Also: Pakistan: భారత్‌తో యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్న ఆసిమ్ మునీర్..ఇమ్రాన్ ఖాన్ సోదరి

US

357 క్యాలిబర్ గ్లాక్ హ్యాండ్‌గన్స్

యూనివర్శిటీ ఆఫ్ డెలావేర్ విద్యార్థి అయిన ఖాన్‌ నవంబర్ 24వ తేదీన పార్కులోని తన పికప్ కారులో కూర్చుని ఆందోళనగా ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. నేరుగా అతడి వద్దకు వెళ్లి వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 357 క్యాలిబర్ గ్లాక్ హ్యాండ్‌గన్స్, 27 రౌండ్లతో లోడ్ చేసిన మూడు అదనపు మ్యాగజైన్‌లు, 9ఎంఎం గ్లాక్ మ్యాగజైన్, ఒక బాలిస్టిక్ ప్లేట్ (బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ భాగం), ఒక చేతితో రాసిన నోట్‌బుక్ లభించాయి.

ఖాన్ దాడికి సంబంధించిన అదనపు ఆయుధాలు

దొరికిన నోట్‌బుక్‌లో.. ఖాన్ దాడికి సంబంధించిన అదనపు ఆయుధాలు, వాటిని దాడిలో ఎలా ఉపయోగించాలి, దాడి తర్వాత చట్టాన్ని అమలు చేసే వారి నుంచి ఎలా తప్పించుకోవాలి వంటి వివరాలు పొందుపరిచాడు. ఈ నోట్‌బుక్‌లో యూనివర్శిటీ ఆఫ్ డెలావేర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సభ్యుడి పేరు, అలాగే యు.డి. పోలీస్ స్టేషన్ లేఅవుట్, ప్రవేశ-నిష్క్రమణ పాయింట్లు కూడా ఉన్నాయి. మ్యానిఫెస్టోలో “అందరినీ చంపడం” (kill all), “మార్టిర్‌డమ్” (Martyrdom – అమరత్వం) వంటి పదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి ప్రణాళికలు, స్పష్టమైన యుద్ధ పద్ధతులు అని పోలీసులు ధృవీకరించారు. అమరుడు కావడమంటే ఇలాంటిది ఏదో ఒకటి చేయాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఆయుధాలు ఏవీ కూడా రిజిస్టర్ కాలేదు.

అరెస్ట్ తర్వాత ఎఫ్‌బీఐ (FBI) అధికారులు విల్మింగ్టన్‌లోని ఖాన్ నివాసంలో సోదాలు నిర్వహించారు.ఈక్రమంలోనే అతడి ఇంట్లో ఏఆర్-శైలి రైఫిల్, రెడ్-డాట్ స్కోప్‌తో అమర్చిన మరో గ్లాక్ పిస్టల్ లభించాయి. ఈ రెండో పిస్టల్‌కు ఒక అక్రమ పరికరం అమర్చబడి, అది నిమిషానికి 1,200 రౌండ్లను కాల్చగలిగే పూర్తి ఆటోమేటిక్ మెషిన్ గన్‌గా మార్చారు. అలాగే మరో 11 పొడిగించిన మ్యాగజైన్‌లు, అత్యంత ప్రమాదకరమైన హాలో-పాయింట్ బుల్లెట్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ లభించాయి. అతని వద్ద లభించిన ఆయుధాలు ఏవీ కూడా రిజిస్టర్ కాలేదు. దీంతో నవంబర్ 26వ తేదీన ఖాన్‌పై అక్రమంగా మెషిన్ గన్‌ను కలిగి ఉన్నాడనే అభియోగం మోపి.. ఎఫ్‌బీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతం అతను జైలులోనే ఉన్నాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu CounterTerrorism Google News in Telugu Latest In telugu news Law Enforcement Pakistani Origin Suspect Telugu News Today Terror Plot Foiled US Security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.