అగ్రరాజ్యం అమెరికా మళ్లీ భారతదేశం మీద సుంకాల బాదుడు మొదలుపెట్టింది. దీంతో స్టాక్ మార్కెట్ మళ్లీ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. భారతదేశం నుండి దిగుమతి చేసుకునే సౌర ఉత్పత్తులపై అమెరికా 126 శాతం సుంకం విధించిన తర్వాత బుధవారం మార్కెట్లో Solar Stocks భారీగా పతనమయ్యాయి. ఈ సుంకాలతో భారతీయ సౌర కంపెనీలు అమెరికాలో సౌర ఉత్పత్తులను అమ్మడం కష్టతరం అనే అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లో సోలార్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ప్రీమియర్ ఎనర్జీస్, విక్రమ్ సోలార్, స్టెర్లింగ్ & విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, సుజ్లాన్ కంపెనీల షేర్లు క్షీణించాయి. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ సెల్స్, సోలార్ ప్యానెల్స్ వంటి ఉత్పత్తులపై 126 శాతం వరకు కౌంటర్‌వైలింగ్ డ్యూటీ విధించనున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ కీలక ప్రకటన చేసింది.
Read Also: TAL Health Fest 2026 : పేదరికం – వైద్యం మధ్య వారధిగా ‘ప్రో బోనో’ నెట్‌వర్క్
అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..
2026 ఫిబ్రవరి 25న ఈ ప్రకటన వెలువడిన వెంటనే భారత సోలార్ పరిశ్రమతో పాటు స్టాక్ మార్కెట్‌లోనూ తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపించింది. భారత సోలార్ తయారీ సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందుతున్న సబ్సిడీలు అమెరికాలోని స్థానిక తయారీదారులకు అన్యాయ పోటీగా మారుతున్నాయని వారి విచారణలో తేలింది. ఈ కారణంతోనే భారీ పన్నులు విధించాల్సి వచ్చిందని అమెరికా వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. ఈ డ్యూటీ అమలులోకి వస్తే భారత సోలార్ ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్‌లో గణనీయంగా పెరిగిపోతాయి. ఉదాహరణకు 100 డాలర్ల విలువైన సోలార్ ప్యానెల్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తే, దానిపై అదనంగా 125 డాలర్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల భారత ఉత్పత్తులు అక్కడి మార్కెట్‌లో పోటీ ఇవ్వడం చాలా కష్టమవుతుంది. దెబ్బకు కుప్పకూలిన ఐటీ షేర్లు.. అందులో పెట్టుబడులు పెట్టిన LIC కి భారీగా నష్టాలు..ఎంతలా అంటే.. ఈ ప్రకటన ప్రభావం స్టాక్ మార్కెట్‌లో వెంటనే కనిపించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: