అమెరికాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఇష్టారాజ్యంగా పలు కారణాలతో సుంకాలు (tariffs) విధిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ దూకుడుగానే ముందుకెళ్తున్నారు. తాజాగా ఇరాన్ తో వాణిజ్యం చేసే దేశాలపై మరో 25 శాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అసలు ట్రంప్ సుంకాల చట్టబద్ధతపై కీలక తీర్పు ఇచ్చేందుకు అమెరికా సుప్రీంకోర్టు (US supreme court) సిద్ధమవుతోంది. దీంతో ట్రంప్ పరోక్ష బెదిరింపులకు దిగారు. అమెరికా విదేశీ వస్తువులపై విధిస్తున్న సుంకాల్ని చట్టబద్ధమే అని నిరూపించుకునేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ప్రయోగిస్తున్నారు. అయితే ఇది నిజంగానే అమెరికా ఇలా ఇష్టారాజ్యంగా విదేశీ వస్తువులు, సేవలపై సుంకాలు విధించేందుకు ఆయనకు అధికారం ఇస్తుందా లేదా, అసలు దీని చట్టబద్ధత ఎంతో తేల్చేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు సిద్దమవుతోంది.
Read Also: Iran Protests: ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు
కీలకంగా మారిన రేపటి తీర్పు
గతంలో ఈ సుంకాల విధింపుపై కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేపటి తీర్పు కీలకంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో మౌఖిక వాదనల సందర్భంగా.. దాదాపు ప్రతి అమెరికా వాణిజ్య భాగస్వామిపై “పరస్పర” సుంకాలను విధించడానికి ట్రంప్ అత్యవసర అధికారాలను వాడటం, అక్రమ మాదకద్రవ్య ప్రవాహాలలో వారి పాత్రపై మెక్సికో, కెనడా ,, చైనాలను లక్ష్యంగా చేసుకుని సుంకాలు విధించడంపై న్యాయమూర్తులు తీవ్ర సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కచ్చితంగా ట్రంప్ కు వ్యతిరేకంగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పరోక్ష బెదిరింపులకు దిగారు. తన సుంకాలలో కొన్ని చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అమెరికా చిక్కుల్లో పడుతుందంటూ ట్రంప్ హెచ్చరించారు. తన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, వందల బిలియన్ డాలర్లు అమెరికా కంపెనీలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కూడా తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: