Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి

Read Time:  1 min
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి
FONT SIZE
GET APP

అమెరికా(america)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మరణించారు. అమెరికాలోని కాలిఫోర్నియా(california) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందారు. మృతులు ఇద్దరు మహబూబాబాద్ మండలం గార్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.

Read Also: Trump: ఎట్టకేలకు యుద్ధం ముగింపుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకారం

Road Accident
Road Accident

లోయలో పడిన కారు

పులఖండం మేఘనారాణి (25), కడియాల భావన (24) ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్లి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కడియాల భావన, మేఘనలు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారని ఇక్కడి వారి బంధువులకు సమాచారం అందించారు.

ఇద్దరు విద్యార్థినులు ఒకే గ్రామానికి చెందిన వారు

ఇద్దరి వయసు 24 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇద్దరు విద్యార్థినులు మరణించడంతో గార్ల గ్రామంలో విషాదం అలుముకుంది. కాలిఫోర్నియాలో జరిగిన మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇద్దరు విద్యార్థినులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం కారు ప్రమాదం(Car Accident) లో మరణించడంతో విషాదచాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.