F-1 visa: 41శాతం విద్యార్థి వీసాల దరఖాస్తులను తిరస్కరించిన అమెరికా

Read Time:  1 min
యూఎస్ లో పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో మార్పులు
యూఎస్ లో పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో మార్పులు
FONT SIZE
GET APP

F-1 visa: విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని చాలామంది ఆశిస్తుంటారు. అందులోనూ అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు మరింత ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అందుకే వివిధ దేశాల నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అగ్రరాజ్యానికి ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ విద్యార్థి వీసాల (F-1 visas) సంఖ్యకు అమెరికా భారీగా కత్తెర వేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) లో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఆమెరికా తిరస్కరించింది.

41శాతం విద్యార్థి వీసాల దరఖాస్తులను

ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తు

అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 2.79 లక్షల (దాదాపు 41 శాతం) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల (36 శాతం) దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలుపలేదు. ఇక 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా.. 1.73 లక్షల (23 శాతం) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

ఎఫ్‌-1 వీసాలు 38 శాతం తగ్గాయి

అయితే తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలను అమెరికా దేశాలవారీగా వెల్లడించలేదు. గత ఏడాది డిసెంబర్‌ 9 వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలు 38 శాతం తగ్గాయి. కొవిడ్‌ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ నెలవారీ నివేదికల డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య 64 వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.