US pilot reaction : దుబాయ్ ఎయిర్‌షోలో తేజస్ యుద్ధవిమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ నమన్ష్ సయాల్ మరణించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆ ప్రమాదం జరిగిన సమయానికే అమెరికా F-16 డెమో పైలట్ టేలర్ “FEMA” హీస్టర్ తన టీమ్‌తో కలిసి తమ ప్రదర్శన కోసం సిద్ధమవుతున్నారు.
ఘటనను ప్రత్యక్షంగా చూశాక, తమ టీమ్ సహా మరికొన్ని స్క్వాడ్‌లు వెంటనే ప్రదర్శన రద్దు చేయాలని నిర్ణయించాయి. అయితే, ఎయిర్‌షో నిర్వాహకులు మాత్రం షోను కొనసాగించడంతో హీస్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Latest News: Farmer Critique: 18 నెలల పాలనపై జగన్ సూటి విమర్శలు
సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్న హీస్టర్, “ఇంతటి విషాదం జరిగిన (US pilot reaction) తర్వాత కూడా షో కొనసాగించడం నిజంగా షాకింగ్. ప్రేక్షకులు ఇంకా అక్కడే కూర్చొని తదుపరి ప్రదర్శనలు చూస్తుండటం చూడడం గుండెను నొప్పించింది,” అని రాశారు.
ప్రమాదం తర్వాత కొద్ది గంటలు గడిచాక షో ప్రాంగణంలో నడుస్తూ తాను ఎవరూ ఉండరని భావించానని, కానీ జనాలు ఇంకా వినోదంలో మునిగిపోయి ఉండటం చూసి వెర్రివేషంలా అనిపించిందని చెప్పారు. పైలట్ కారు పక్కన అతని వ్యక్తిగత వస్తువులు అలాగే ఉండడం, ఇండియన్ టెక్నీషియన్‌లు ఖాళీగా మారిన పార్కింగ్ స్పాట్ వద్ద నిలబడి ఉండటం తనను బాగా కలచివేసిందని తెలిపారు.
“మన టీమ్‌లో ఎవరో ఒకరు లేకపోయినా, షో మాత్రం సాధారణంగా కొనసాగుతుందా అనే ఆలోచన నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది,” అని హీస్టర్ తెలిపారు. ఈ అనుభవం తాను డెమో ఫ్లయింగ్ ముగించిన తర్వాత కూడా జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు.
ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్కమాండర్ సయాల్‌ను అత్యంత నిబద్ధతతో పనిచేసిన, అసాధారణ నైపుణ్యం కలిగిన, ధైర్యవంతుడైన అధికారి అని నివాళులర్పించింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :