📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

US: వెనిజులా అధ్యక్షుడిని పట్టివ్వండి..రూ.430 కోట్లు ఇస్తాం..అమెరికా

Author Icon By Vanipushpa
Updated: August 8, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సాయం చేస్తే భారీగా సొమ్ము ఇస్తామని తెలిపింది. గత కొన్నేళ్ల నుంచి వెనిజులా అధ్యక్షుడు(venezuela president) నికోలస్ మదురో(Nicolas Maduro) అమెరికాకు తలనొప్పిగా మారారు. దీంతో ఆయన్ని తమ అధినంలోని తీసుకోవాలని ట్రంప్‌ సర్కార్‌ భావిస్తోంది. ఇందుకోసం నికోలస్‌ను అరెస్టు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆయన్ని అరెస్టు చేసేందుకు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్లకు ఏకంగా 50 మిలియన్ డాలర్లు (రూ.430 కోట్లు) ఇస్తామని ఆఫర్‌ ప్రకటించింది.

USA: వెనిజులా అధ్యక్షుడిని పట్టివ్వండి..రూ.430 కోట్లు ఇస్తాం..అమెరికా

అమెరికాలో డ్రగ్స్‌ వాడకాన్ని పెంచుతున్న నికోలస్
దీనికి సంబంధించిన వీడియోను అమెరికా అటార్నీ జనరల్ పామ్‌బాండీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ” అమెరికాలో డ్రగ్స్‌ వాడకాన్ని పెంచేందుకు, హింసను ప్రేరేపించేందుకు నికోలస్ మదురో.. ట్రెన్‌ డె అరాగువా, సినలో, కార్డల్ ఆఫ్‌ ది సన్స్ వంటి విదేశీ ఉగ్ర సంస్థలను వాడుకుంటున్నారని తెలిపారు. నికోలస్, ఆయనకు సన్నిహితులకు సంబంధించి ఇప్పటిదాకా 30 టన్నుల కొకైన్‌కు అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ సీజ్‌ చేసిందని పామ్‌బాండీ పేర్కొన్నారు. ఇందులో 7 టన్నులతో స్వయంగా మదురోకు లింక్‌ ఉందని ఆరోపణలు చేశారు. వెనుజువెలా, మెక్సికో కేంద్రంగా ఉన్న ఈ డ్రగ్‌ సంస్థలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

నికోలస్‌పై 15 మిలియన్ డాలర్ల రివార్డు
అంతేకాదు నికోలస్‌కు కేవలం కోకైన్‌తో మాత్రమే కాకుండా ఫెంటెనిల్‌ స్మగ్లింగ్‌తో కూడా లింక్స్‌ ఉన్నట్లు పామ్‌బాండీ వెల్లడించారు. దీనివల్ల అమెరికాలో ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని తెలిపారు. 2020 మార్చిలో ఆయనపై దక్షిణ న్యూయార్క్‌ డిస్ట్రిక్ట్‌లో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నికోలస్ తమ నుంచి తప్పించుకోలేరన్నారు. ఇదిలాఉండగా ట్రంప్ మొదటిసారి అధికారంలో వచ్చినప్పుడు కూడా నికోలస్‌పై 15 మిలియన్ డాలర్ల రివార్డు ఉండేది.
ఆ తర్వాత జో బైడైన్ ప్రభుత్వం వచ్చాక ఆ రివార్డును 25 మిలియన్ డాలర్లకు పెంచింది. మరోవైపు ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ జస్టిస్‌ నికోలస్ మదురోకు సంబంధించి 700 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసింది. వీటిలో తొమ్మిది వాహనాలు, ప్రైవేట్‌ జెట్‌లు కూడా ఉన్నాయి.

వెనిజులా ఎందుకు ప్రసిద్ధి చెందింది?
ఇది ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం, ఏంజెల్ జలపాతాలకు నిలయం మరియు సహజ వనరులు మరియు అందాలతో సమృద్ధిగా ఉంది. దాని జీవవైవిధ్య వర్షారణ్యాలు, అసాధారణ భూభాగం మరియు వెచ్చని కరేబియన్ సముద్రం మరియు అట్లాంటిక్ తీరం పర్యాటకులకు వెనిజులాలో చేయడానికి అనేక విషయాలను ఎంచుకోవడానికి ఎంపికలను అందిస్తాయి.
వెనిజులాలో వాతావరణం ఎలా ఉంటుంది?
వెనిజులాలో వేడి మరియు తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణం ఉంటుంది, ఇది ఎత్తైన ప్రాంతాలలో మరింత మితంగా ఉంటుంది. రాజధాని కారకాస్‌లో ఉష్ణమండల సవన్నా వాతావరణం ఉంటుంది. వార్షిక అవపాతం శుష్క మండలాల్లో 400 మి.మీ నుండి వెనిజులా అమెజాన్‌లో 4,000 మి.మీ వరకు ఉంటుంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత 24°C మరియు 27°C మధ్య ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-constable-dies-on-the-spot-after-being-hit-by-a-bullet-in-the-head/crime/527854/

Bounty announcement Global Politics International Diplomacy Latest News Breaking News Nicolas Maduro Telugu News US bounty US Venezuela relations Venezuela president

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.