📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hormuz Strait: హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

Author Icon By Vanipushpa
Updated: March 11, 2026 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌(Hormuz) జలసంధి సమీపంలో భీకర దాడులు జరిగాయి. ఈ జలసంధి సమీపంలో ఇరాన్‌ మోహరించిన మైన్‌లేయర్స్‌, నౌకలు లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడడంతో అవి ధ్వంసమయ్యాయి. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్స్‌తో పాటు పలు నౌకలు ధ్వంసం అయ్యాయని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్ వెల్లడించింది. ఈ క్రమంలనే దాడికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసింది. జలసంధిలో పేలుడు సృష్టించడానికి ఇరాన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందిందని ఆ దేశ మీడియా ప్రచురించింది.

Read Also: Mysterious Virus in Poultry: అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

Hormuz Strait: US attacks near the Strait of Hormuz

ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్‌ మైన్‌లేయర్స్‌ను ధ్వంసం

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ సైతం ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. జలసంధి సమీపంలో ఇరాన్‌ ఎక్కడైనా మైన్స్‌ను అమర్చినట్లయితే వాటిని తక్షణమే తొలగించాలని ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్ చేశారు. లేదంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ స్వయంగా వాటిని తీసేస్తే మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు. లేదంటే కరేబియన్‌ సముద్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన క్షిపణులను వాడి జలసంధిలోని మైన్‌లేయర్స్ పడవలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేశారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్‌ మైన్‌లేయర్స్‌ను ధ్వంసం చేసినట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌కు ఇచ్చిన అనుమతి వల్ల పుతిన్ సర్కార్‌కు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని శ్వేతసౌధం ప్రకటించింది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Global Oil Supply Iran-US Tensions maritime security middle east conflict military escalation Pentagon Statement Persian Gulf Crisis Strait of Hormuz Strategic Waterways Telugu News Today US military strikes US Navy Operations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.