📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran-America War: నాలుగు రోజుల్లో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ కోల్పోయిన అమెరికా

Author Icon By Vanipushpa
Updated: March 6, 2026 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌ మీద ముప్పేట దాడులు చేస్తున్న అమెరికా.. నాలుగు రోజుల్లోనే పెద్ద మొత్తంలో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను కోల్పోయింది. వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్న ఇరాన్‌… తన సమీప దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నది. ఈ క్రమంలో ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు 200 కోట్ల డాలర్ల విలువైన మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ ఇరాన్‌ (Iran) దాడుల్లో నాశనమైందని అంచనా వేస్తున్నారు. ఖతార్‌లోని అల్‌ ఉదేయిద్‌ ఎయిర్‌ బేస్‌ వద్ద అమెరికా ఒక ముందస్తు హెచ్చరిక రాడార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలోని ఏఎన్‌/ఎఫ్‌పీఎస్‌–132 ఎర్లీ వార్నింగ్‌ రాడార్‌ వ్యవస్థపై ఇరాన్‌ క్షిపణి దాడి చేసిందని ఖతార్‌ అధికారులు ధృవీకరించారు. ఈ రాడార్‌ విలువ సుమారు 1.1 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.

Read Also: US Iran Conflict: ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా

Iran-America War: America lost military equipment in four days

సుమారు 282 మిలియన్‌ డాలర్లు ఉంటాయని అంచనా

ఆదివారం కువైట్‌ వైమానిక రక్షణ వ్యవస్థ.. పొరపాటున అమెరికాకు చెందిన మూడుs ఎఫ్‌–15 స్ట్రైక్‌ ఈగిల్‌ యుద్ధ విమానాలను కూల్చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఆరుగురు పైలట్లు ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ మూడు విమానాలు … సుమారు 282 మిలియన్‌ డాలర్లు ఉంటాయని అంచనా. బహ్రెయిన్‌లో అమెరికా నేవీ బేస్‌పై దాడి మరో దాడిలో బహ్రెయిన్‌ రాజధాని మనామాలోని అమెరికా నేవీకి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఫిఫ్త్‌ ఫ్లీట్‌ ప్రధాన కార్యాలయాన్నిలక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ దాడిలో రెండు కమ్యూనికేషన్‌ టెర్మినల్స్‌, పలు భారీ భవంతులు ధ్వంసం అయ్యాయని సమాచారం. వీటిని ఏఎన్‌/జీఎస్‌సీ–52బీ సాట్‌కామ్‌ టెర్మినల్స్‌గా గుర్తించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Al Udeid Air Base Attack AN/FPS-132 Radar Damage Iran US Conflict 2026 Military Asset Damage Operation Epic Fury Telugu News online Telugu News Today US Military Equipment Losses

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.