US-Israel vs Iran: పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు చేపట్టిన దాడులు మూడో వారానికి చేరుకున్నాయి. ఇరాన్‌లో నాయకత్వ మార్పు (Regime Change) ధ్యేయంగా మొదలైన ఈ పోరాటం, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. చమురు క్షేత్రాలపై దాడులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ కొరత ఏర్పడటంతో అమెరికాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెంటగాన్ వేదికగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Nagaraju Balkam arrest: అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. మైనర్లతో అసభ్య చాటింగ్ చేస్తూ బుక్!
ఇరాక్ తరహా సుదీర్ఘ యుద్ధం కాదు
పెంటగాన్‌లో ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్.. ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. గత వారం ఇరాక్‌లో మరణించిన ఆరుగురు అమెరికా సైనికుల కుటుంబాలతో తాను మాట్లాడానని, వారు పని పూర్తయ్యే వరకు ఆగవద్దని తనను, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారని ఆయన తెలిపారు. అయితే ఇరాన్‌తో సంఘర్షణ శాశ్వత యుద్ధం కాదని ఆయన తేల్చేశారు. ఇది ఇరాక్ యుద్దం తరహాలో సుదీర్ఘంగా సాగబోదని తేల్చిచెప్పేశారు.
తమ ఇంధన మౌలిక సదుపాయాలపై మళ్లీ దాడి జరిగితే, గల్ఫ్ చమురు, గ్యాస్ సౌకర్యాలు పూర్తిగా నాశనమవుతాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇవాళ హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా సౌదీ అరామ్ కో, యూఏఈ టెర్మినల్స్, ఖతార్‌లో మిగిలి ఉన్న ఎల్‌ఎన్‌జి ట్రైన్‌లతో సహా ప్రతి గల్ఫ్ ఇంధన ఆస్తినీ ఇప్పుడు ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.
ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి ప్రకటన వెలువడింది. నిన్న రాత్రి ఇజ్రాయెల్ తమ దేశంలోని సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై జరిపిన దాడికి ప్రతిగా ఇవాళ గల్ఫ్ దేశాల్లో తీవ్రదాడులకు దిగుతున్న ఇరాన్ ను ఎలా నియంత్రించాలో తెలియని పరిస్ధితుల్లో ఉన్న అమెరికా .. యుద్ధాన్ని త్వరలో ముగిస్తామని చేసిన ప్రకటన చర్చనీయాశంవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: