📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran-US-Israel War: ఇరాన్‌ పై దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

Author Icon By Vanipushpa
Updated: March 6, 2026 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద తమకు వైమానికంగా ఆధిపత్యం ఉందని, తమ ఫైటర్ జెట్లు లక్ష్యాల మీద కాావలసినట్లు దాడి చేసే వీలుందని అమెరికా, ఇజ్రాయెల్ తెలిపాయి. నిఘా విషయంలోనూ ఈ రెండు దేశాలకున్న అధిపత్యం వల్లే అనేకమంది ఇరాన్(Iran) నాయకుల్ని చంపగలిగాయి. అయితే, ఇరాన్ నాయకత్వాన్ని లేకుండా చేయడం వెనుక వ్యూహం ఏంటి? ఒక సమాధానం ఏంటంటే గందరగోళం సృష్టించడం. అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రారంభించినప్పుడు ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ నివాసం వారి లక్ష్యం కాదు. అయితే అమెరికన్ సైబర్ కమాండ్, స్పేస్ కమాండ్ హ్యాకర్లు వారి ఇజ్రాయెల్‌ సహచరులు, ఇరాన్ నిఘా విభాగం కళ్లకు గంతలు కట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఇరాన్ నిఘా విభాగం విఫలమైందని అమెరికన్ సైనిక అధికారులు చెబుతున్నారు. ఇది అమెరికా, ఇజ్రాయెల్‌కు అవకాశంగా మారింది. ఇరాన్ సీనియర్ నాయకులు తమ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. సీఐఏ, మొసాద్ సంస్థలు రెండూ ఇరాన్ నిఘా విభాగం అధికారుల్ని కొన్ని నెలలుగా ట్రాక్ చేస్తూ వచ్చాయి.

Read Also: Indonesia Social Media Ban: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

Iran-US-Israel War: What is the US and Israel’s strategy in attacking Iran?

ఇరాన్‌ను గందరగోళంలోకి నెట్టేందుకే దాడులు

మొస్సాద్ గూఢచారులు ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలలో చాలా కాలంగా సాంకేతిక సమస్యల్ని సృష్టించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు. దీని ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. చనిపోయిన వారిలో సైన్యాధిపతి, రక్షణ మంత్రి, రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి కూడా ఉన్నారు. ఈ దాడులకు ఇజ్రాయెల్ నాయకత్వం వహించినట్లు భావిస్తున్నారు. దాడుల ప్రారంభంలో తాము ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్, ఖండాంతర క్షిపణి కేంద్రాలు, నిఘా వ్యవస్థ మౌలిక వసతులపై దాడులు చేసినట్లు అమెరికా చెబుతోంది. ఇరానియన్లను ‘గందరగోళంలో పడేయడం’ ఈ దాడుల ఉద్దేశమని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్ చెప్పారు. తమపై దాడులు జరుగుతాయనే వాస్తవాన్ని తెహ్రాన్ నాయకత్వం గ్రహించింది. తాము మరణిస్తే తమ స్థానంలో నియమించవలసిన వారి గురించి అధికారులకు ముందే సూచనలు ఇచ్చారు. ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలిసినప్పటికీ ఇరానియన్ నాయకులు అనేకమంది శనివారం ఉదయం సమావేశం కావడం ఆశ్చర్యం కలిగించే అంశం. అందరూ ఒకే చోట సమావేశం కావడంతో వారిని చంపడం ప్రత్యర్థులకు తేలిగ్గా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్‌ను చంపేస్తే , రివల్యూషనరీ గార్డ్స్‌లోని అతివాదులు పాలన మీద మరింత పట్టు బిగిస్తారని, యుద్ధం ప్రారంభించడానికి ముందు సీఐఏ నిఘా విభాగం అంచనా వేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Decapitation Strike Iran Iran Air Defense Suppression Iran Regime Change Strategy Operation Epic Fury USA Operation Roaring Lion Israel Telugu News Paper Telugu News Today US Israel Strategy Iran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.