📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US Iran War Cost: ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

Author Icon By Saritha
Updated: March 3, 2026 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

US Iran War Cost: యుద్ధమేఘాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటితో నాల్గవ రోజుకు చేరుకుంది. మొదట పరిమిత స్థాయిలో ప్రారంభమైన ఈ వార్ ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం మొత్తం వ్యాప్తి చెందుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలకు దారితీస్తోంది. ఈ యుద్ధం కనీసం నాలుగు వారాల పాటు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు (Donald Trump) స్పష్టం చేశారు. అవసరమైతే మరింత కాలం కూడా యుద్ధం కొనసాగించే సైనిక సామర్థ్యం తమ వద్ద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రకటనతో పాటు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఒక్కటే.

Read Also: War Updates: యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

US Iran War Cost: US treasury emptied by war on Iran

యుద్ధం కారణంగా అమెరికాకు ఎంత ఖర్చు అంటే ?

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ప్రారంభమైన ఇరాన్‌పై దాడి మొదటి 24 గంటల్లోనే అమెరికాకు సుమారు 779 మిలియన్ డాలర్లు ఖర్చయింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 7,100 కోట్లకు పైగా అవుతుంది. ఇది కేవలం యుద్ధం మొదటి రోజునే, అదేవిధంగా అల్ జజీరా నివేదిక ప్రకారం.. యుద్ధం ప్రారంభమయ్యే ముందు సైనిక సన్నాహాలకే అమెరికా ఇంకా 630 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

ఈ ఇరాన్‌ దాడి లో F-18, F-16, F-22, F-35 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను వినియోగించారు. వీటి ఆపరేషన్ ఖర్చు మాత్రమే సుమారు 271 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. వీటితో పాటు EA-18G గ్రోలర్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విమానాలు, A-10C థండర్‌బోల్ట్ అటాక్ విమానాలు, MQ-9 రీపర్ డ్రోన్‌లు, ఇతర మానవరహిత యుద్ధ వ్యవస్థలు కూడా ఉపయోగంలో ఉన్నాయి. ప్రతి డ్రోన్, ప్రతి ఫ్లైట్ గంట కూడా భారీ ఖర్చునే మోస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump war statement operation cost Operation Epic Fury expenditure US Iran war cost

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.