📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US-Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధం.. మంత్రి స్కాట్ బెసెంట్

Author Icon By Saritha
Updated: March 7, 2026 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

US-Iran War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత తీవ్రమవుతోంది. మార్చి 7, శనివారం రాత్రికి యుద్ధం తారాస్థాయికి చేరే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ (Scott Besant) తెలిపారు. ఇరాన్‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు అమెరికా సర్వసన్నద్ధమైందని బెసెంట్ వెల్లడించారు. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, లాంచర్లను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా అమెరికా దళాలు ముందుకు కదులుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రిని అమెరికా చేసింది.

Read Also: Israel Iran War: టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

US-Iran War: America is ready to attack Iran.. Minister Scott Besant

ఇరాన్ లక్ష్యాలపై అమెరికా గురి

అంతర్జాతీయంగా ఆర్థిక గందరగోళాన్ని సృష్టించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తోందని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. దీనిని అడ్డుకునేందుకు అమెరికా కఠిన చర్యలు చేపడుతోంది.

ఇరాన్‌ను చుట్టుముట్టేందుకు అమెరికా తన నౌకాదళ శక్తిని ఉపయోగిస్తోంది. ఇప్పటికే రెండు భారీ యుద్ధ విమాన వాహక నౌకలను (Aircraft Carriers) ఇరాన్ తీరం వైపు తరలించగా, మరో రెండు నౌకలు కూడా చేరుకుంటున్నాయి. ఇరాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Scott Bessent Statements US Iran War 2026 US Military West Asia Conflict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.