📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan: పాకిస్తాన్‌పై యూఎస్ అత్యాశ

Author Icon By Vanipushpa
Updated: May 2, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ అప్రమత్తమైంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తమ చర్య కాదని నిరూపించుకునే పనిలో పడింది. తాము పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదులు, మిలిటెంట్ గ్రూపులే పహల్గామ్ నరమేధానికి పాల్పడ్డాయంటూ భారత్ పదే పదే చెబుతోండటాన్ని తప్పు పట్టింది.

సమగ్ర దర్యాప్తుకు మేము సిద్ధం: పాక్

పహల్గామ్ ఉగ్రదాడిపై తటస్థ ఏజెన్సీల ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఖైబర్‌ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కకుల్‌లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బలంగా విశ్వసించదగ్గ తటస్థ దర్యాప్తు ఏజెన్సీల ద్వారా పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించడానికి సిద్ధంగా ఉన్నానని షరీఫ్ వెల్లడించారు. పహల్గామ్‌లో జరిగిన విషాదకర సంఘటనను తమపై నిందలు వేయడానికి, ఆరోపణలు చేయడానికి వినియోగించుకోవడం సరైంది కాదని అన్నారు.

దీన్ని బ్లేమ్ గేమ్‌గా అభివర్ణించారు. ఇప్పుడిదే విషయాన్ని తాజాగా అమెరికా ప్రస్తావించింది. ఫహల్గామ్ ఉగ్రవాద దాడిపై చేపట్టిన దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని పాకిస్తాన్‌కు సూచించింది. పహల్గామ్ దాడి ఘటనపై తటస్థ ఏజెన్సీలతో దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి కట్టుబడి ఉండాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సహించం: జేడీ వాన్స్

ఉగ్రవాదంపై పాకిస్తాన్ మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని తేల్చి చెప్పారు. తమ దేశ భూభాగంపై కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఉగ్రవాదులను వేటాడాలని సూచించారు. ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్తాన్.. భారత్‌కు సహకరిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడ? ఏ మూలన? ఏ రూపంలో ఉన్నా సహించకూడదని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.

గతంలో న్యూయార్క్ ట్వి్ టవర్స్‌పై అల్ ఖైదా దాడి తరువాత అమెరికా ఏ రకంగా దాన్ని మట్టుబెట్టిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదం ప్రపంచ దేశాల పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. పాకిస్తాన్ పహల్గామ్ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు మద్దతు ఇచ్చింది. కానీ, ఈ దర్యాప్తు అంతర్జాతీయ ఏజెన్సీల ద్వారా జరిగేలా ఉంటుంది, ఇది సంబంధిత దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీయవచ్చు.

Read Also: America: ఉగ్రవాదంపై పాకిస్తాన్ మరింత కఠినంగా ఉండాలి: అమెరికా

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu on Pakistan Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US greed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.