📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

Latest Telugu News: Trump-పంట అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు

Author Icon By Vanipushpa
Updated: September 29, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాలు అమెరికా రైతులకు తీవ్ర సంక్షోభాన్ని మిగిలుస్తున్నాయి. సోయాబీన్, మొక్కజొన్న(Soyabeans, Corn) రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ పాలనలో సుంకాల ప్రభావం, వాణిజ్య యుద్ధం రెండు పంటలకు పెనుముప్పుగా మారుతున్నాయి. చైనా అమెరికా(China-America) సోయాబీన్ కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల అమెరికా రైతులు దశాబ్దాల‌లో అత్యంత సంక్లిష్టమైన మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సాపేక్షంగా గత సంవత్సరం US సుమారు 24.5 బిలియన్ డాలర్ల విలువైన సోయాబీన్ ఎగుమతులు చేసింది. అయితే అందులో చైనా 12.5 డాలర్ల బిలియన్ల విలువై ఉత్పత్తిని కొనుగోలు చేసింది. అయితే ఈ సంవత్సరం చైనా ఆ కొనుగోళ్లను ఆపేయడంతో అమెరికన్ రైతులు తమ పంటను అమ్మే మార్గం లేకపోయింది. దీని కారణంగా వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

పరిశ్రమకు ఒక పెద్ద హెచ్చరిక
మే నెలలో.. ట్రంప్ ప్రభుత్వంలోని భారీ సుంకాలు చైనా దిగుమతులపై విధించబడ్డాయి. దీనికి ప్రతిస్పందనగా చైనా.. అమెరికన్ సోయాబీన్, మొక్కజొన్న పై 34 శాతం సుంకాన్ని విధించి కొనుగోళ్లు నిలిపివేయడం ద్వారా ప్రతీకారం తీర్చింది. అమెరికన్ సోయాబీన్ అసోసియేషన్ చీఫ్ కాలేబ్ రాగ్లాండ్ మాట్లాడుతూ.. ఇది పరిశ్రమకు ఒక పెద్ద హెచ్చరిక అని అన్నారు. ఈ పరిస్థితి అమెరికా రైతులకు నష్టాలు, పంట నిల్వ సమస్యలు, మార్కెట్ లభ్యత పరిమితులతో పాటు, అమెరికా లో రాజకీయ ఉద్రిక్తతలను కూడా పెంచింది.

Trump-పంట అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు

పెరుగుతున్న రైతుల ఆందోళనలు

అక్కడ రైతుల ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికన్ సోయాబీన్ ఎగుమతి మండలి CEO జిమ్ సుట్టర్ మాట్లాడుతూ.. మే, సెప్టెంబర్ మధ్య నాలుగు రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి ఒప్పందం కుదరలేదు. సమయం ముగిసిపోతోందని నేను ఆందోళన చెందుతున్నాను. ట్రంప్, అవసరమైతే తాత్కాలిక ఉపశమన ప్యాకేజీని పరిశీలిస్తున్నారని ప్రకటించినప్పటికీ, రైతులు దీన్ని పూర్తిగా పరిష్కారం అనుకోవడం లేదు.ఇప్పటి పరిస్థితి చైనా వ్యూహంపై ఆధారపడింది కాబట్టి అమెరికా మొదటి అడుగు వేయాలని తెలిపారు. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హీ యాడోంగ్ ప్రకారం.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడానికి అమెరికా అన్యాయమైన సుంకాలను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి ఉత్పత్తులు, సముద్ర ఆహార ఎగుమతులు చైనా ప్రతీకార సుంకాల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నిపుణుల ప్రకారం.. భారతదేశం, చైనా తమ స్థిరమైన వాణిజ్య విధానాలను కొనసాగిస్తే, అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు ఉండరు. ఈ పరిస్థితి కొనసాగితే, ట్రంప్ కూడా నిర్ణయాలను మళ్ళీ పునర్విచారించవలసి వస్తుందని సూచిస్తున్నారు.

అమెరికా సెనేట్‌లో వేడేక్కిన రైతుల సమస్యలు

ఇక అమెరికా సెనేట్‌లో కూడా రైతుల సమస్యలు వేడెక్కాయి. సౌత్ డకోటా రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సంక్షోభం ప్రధాన చర్చ అంశంగా నిలిచిందని NBC మీట్ ది ప్రెస్‌లో సెనేట్ నాయకుడు జాన్ థూన్ పేర్కొన్నారు. చైనా 34 శాతం సుంకాన్ని అమలు చేసి.. అమెరికన్ సోయాబీన్ కొనుగోళ్లను ఆపడం వల్ల రైతులు అధిక పంట నిల్వ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. భారతదేశం కూడా యుఎస్ కు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా గుర్తించబడింది. అయితే విభిన్న వ్యూహాలతో స్థిరంగా ఉండటం ట్రంప్ ప్రయత్నాలను విఫలపరిచింది. భారతదేశంలో సోయాబీన్, మొక్కజొన్నపై సుంకాలు అధికంగా ఉంటాయి. (మొక్కజొన్న 45%, సోయాబీన్ 60%). అలాగే కొన్ని అమెరికన్ సోయాబీన్ రకాల దిగుమతిని నిషేధించింది. సోయా నూనె, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కోసం భారత్ ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్ వంటి దేశాలపై ఆధారపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

agricultural economy agriculture problems in America crop crisis farmer struggles rural distress USA unsold crops US farmers US farming news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.