అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిత్రాలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ఎప్‌స్టీన్ కుంభకోణానికి సంబంధించి సుమారు 16 ఫైళ్ల వరకూ అదృశ్యమయ్యాయని ఇటీవల పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వీటిలో న్యాయశాఖ వెబ్ పేజీ నుంచి డొనాల్డ్ ట్రంప్ సహా కొన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు అదృశ్యమయ్యాయి. ముఖ్యంగా ట్రంప్ సతీమణి మెలానియా ఎప్‌స్టీన్, ఆయన సహాయకురాలు గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌తో దిగిన చిత్రం, ట్రంప్.. కొందరు అమ్మాయిలతో దిగిన ఫొటోలు మాయమయ్యాయి.
Read Also: St. Joseph’s Church: సింగపూర్ చర్చిలో ఫేక్ బాంబు.. భారత సంతతి వ్యక్తి అరెస్టు
దీంతో డెమోక్రటిక్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ట్రంప్‌ను రక్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా చేశారని డెమోక్రాట్లు ఆరోపించారు. అటు హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీన్ కూడా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే.. ఆ పిక్ తొలగింపు వెనుక ఎవరి ప్రమేయమూ లేదని న్యాయశాఖ తెలిపింది. కేవలం రివ్యూ కోసమే తాత్కాలికంగా ట్రంప్ ఫొటోను తొలగించినట్టు పేర్కొంది. సమీక్ష అనంతరం ఆ ఫొటోల్లో ఎప్‌స్టీన్ బాధితులెవరూ లేరని తేలడంతో మరలా జోడించినట్టు వివరించింది.
మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్
ప్రముఖ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందిన జెఫ్రీ ఎప్‌స్టీన్(Jeffrey Epstein)కు డొనాల్డ్ ట్రంప్, బిల్‌గేట్స్ , బిల్‌క్లింటన్, మైకేల్ జాక్సన్ సహా పలువురు ప్రముఖులతో మంచి సంబంధాలుండేవి. అయితే.. వారిలో కొందరికి ఎప్‌స్టీన్.. అమ్మాయిలను సరఫరా చేస్తుండేవారని అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యారు. దాంతో అప్పుడు సంచలన విషయాలు బయటపడే అవకాశముందని అందరూ భావించారు. కానీ, 2019 ఆయన జైల్లో అనుమానాస్పదంగా మృతిచెందడంతో.. ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం యూఎస్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ట్రంప్ హయాంలోనే ఈ ఫైళ్లు బయటకు వస్తాయని భావించినా.. అలా జరగలేదు. అయితే.. ఈ విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఇటీవల ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ఆ ఫైల్స్ విడుదలయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: