📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Attack: అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

Author Icon By Vanipushpa
Updated: March 14, 2026 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పరిణామం చోటుచేసుకుంది. ఈ వికృత ఉగ్రవాద చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితులలో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమారులు ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. వీరికి నార్వే కోర్టు(Court of Norway) నాలుగు వారాల పాటు పోలీస్ కస్టడీ విధించింది.

ఓస్లోలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద భారీ పేలుడు

గత ఆదివారం తెల్లవారుజామున ఓస్లోలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. అత్యంత శక్తివంతమైన ఐఈడీతో నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడు ధాటికి ఎంబసీలోని కన్సులర్ సెక్షన్ ప్రవేశ ద్వారం తీవ్రంగా దెబ్బతింది. అయితే పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ పోలీసులు ఈ ఘటనను తీవ్రమైన ఉగ్రవాద పేలుడుగా అభివర్ణించారు. ప్రాణనష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ పేలుడుకు ప్లాన్ చేశారని దర్యాప్తులో గుర్తించారు.

Read Also: AI Effect: 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

Attack: Bomb attack on US embassy.. Four accused from the same family

నలుగురూ కలిసి ఈ కుట్రలో భాగస్వామ్యం

ఈక్రమంలోనే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే అరెస్టయిన నలుగురిలో ఒక కుమారుడు బాంబును తానే అమర్చినట్లు కోర్టులో అంగీకరించాడు. అయితే మిగిలిన ఇద్దరు సోదరులు, తల్లి మాత్రం తమకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నారు. వీరి తరపు న్యాయవాదులు కూడా వారు అమాయకులని వాదిస్తున్నారు. కానీ.. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల ప్రకారం నలుగురూ కలిసి ఈ కుట్రలో భాగస్వామ్యం వహించినట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. నార్వే ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bomb Attack Counter-Terrorism Family Suspects international security Investigation security breach Telugu News Paper Telugu News Today Terrorist attack US Embassy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.