📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

TRF : టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా..అభ్యంతరం లేదన్న పాక్

Author Icon By Sudha
Updated: July 26, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్ (TRF)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే.అమెరికా నిర్ణయంపై పాక్‌ తాజాగా స్పందించింది. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ (Ishaq Dar) వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ఇషాక్‌ దార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాక్‌ మంత్రి మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎఫ్‌ను (TRF)ఉగ్రసంస్థగా ప్రకటించే సార్వభౌమాధికారం అమెరికాకు ఉంది. యూఎస్‌ నిర్ణయంతో మాకు ఎలాంటి సమస్యా లేదు. వారి ప్రమేయం ఉందని ఆధారాలు ఉంటే అలా చేయొచ్చు. మేము స్వాగతిస్తాము’ అని వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇషాక్‌ దార్‌ పేర్కొన్నారు. అయితే, టీఆర్ఎఫ్‌ (TRF)కు లష్కరే తోయిబాకు ముడిపెట్టడం మాత్రం తప్పని స్పష్టం చేశారు. ఆ సంస్థను తాము కొన్ని సంవత్సరాల క్రితమే కూల్చేశామన్నారు.

TRF : టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా..అభ్యంతరం లేదన్న పాక్

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసరాన్‌ వ్యాలీలో పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మారణహోమానికి తామే బాధ్యులమని ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’(TRF) ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత టీఆర్‌ఎఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

బాసిత్ అహ్మద్ దార్ ఎవరు?

బాసిత్ దార్ లేదా అబూ కమ్రాన్ అలీ అని కూడా పిలుస్తారు. 12 ఏప్రిల్ 2002 – 7 మే 2024) ఒక కాశ్మీరీ వేర్పాటువాద ఉగ్రవాద కమాండర్. ఆగస్టు 2021లో TRF కమాండర్ ముహమ్మద్ అబ్బాస్ షేక్ హత్య తర్వాత అతను ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) యొక్క చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా ఉన్నాడు. అతను కాశ్మీర్ లోయలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడు, అతని తలపై ఒక మిలియన్ INR రివార్డు ఉంది.

ది రెసిస్టెన్స్ ఫ్రంట్ స్థాపకుడు ఎవరు?

షేక్ సజ్జాద్ గుల్ (జననం 1974), షేక్ సజ్జాద్ అని కూడా పిలుస్తారు, ఒక కాశ్మీరీ ఉగ్రవాది మరియు 2019 నుండి భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ మరియు కాశ్మీర్‌లో చురుకుగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ స్థాపకుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bangladesh: బంగ్లాదేశ్, పాకిస్థాన్ల మధ్య కొత్త స్నేహం

BreakingNews Lashkar-e-Taiba latest news Pahalgam Attack Pakistan Telugu News The Resistance Front TRF US terrorism list

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.