📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump: హెచ్ 1బీ వీసాపై కోర్టులో సవాల్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్

Author Icon By Vanipushpa
Updated: October 17, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూఎస్ హెచ్ 1బీ వీసా(h1b visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) నిర్ణయం తీసుకున్నారు. దీనిపై చాలానే గందగోళం రేగింది. భారత్, చైనా దేశాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. దాంతో పాటూ లాటరీ విధాన్ని తీసేస్తామని కూడా ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం. దీని వలన అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలే నష్టపోతాయన్నది వాస్తవం. అయితే ఇప్పటి వరకూ ఏ కంపెనీ కూడా ట్రంప్ ను హెచ్ 1బీ వీసాల విషయమై ప్రశ్నించలేదు.

Read Also: Rahul Gandhi : ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారు : రాహుల్‌ గాంధీ

Trump: హెచ్ 1బీ వీసాపై కోర్టులో సవాల్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఆందోళన వ్యక్తం చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్

అయితే ఇప్పుడు 3లక్షల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) పై దావా వేసింది. ఆయన అధికార పరిధికి మించి నిర్ణయాన్ని తీసుకున్నారని అందులో ఉటంకించింది. డీసీలోని ఫెడరల్ కోర్టులో ఈ దావా ఫైల్ అయింది. కాంగ్రెస్‌ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వలన చాలా కంపెనీలు నష్టపోతున్నాయని…తక్కవు నైపుణ్యం కలవారిని నియమించుకోవాల్సి వస్తుందని చెబుతోంది. అంతేకాదు ఈ నిర్ణయం వలన హెచ్‌-1బీ ఉద్యోగులను బలవంతంగా తగ్గించుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇది వారి పెట్టుబడిదారులతో పాటు కస్టమర్‌లు, సొంత ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని వాదించింది.

గతంలో ట్రంప్ ఆదేశాలను రద్దు చేసిన ఫెడరల్ కోర్టు

అమెరికాలో ఉన్న మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలతో సహా దేశంలోనే అత్యధిక కంపెనీల సభ్యత్వం కలిగిన వ్యాపార సంస్థల లాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇది పోరాటంలోకి దిగితే ఎదురు నిలబడడం కాస్త కష్టమే. ఇప్పటి వరకు టెక్ కంపెనీలు విడిగా ట్రంప్ హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు వారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గనుక కేసు వేస్తే, ట్రంప్ తో వీరు కోర్టులో పోరాడటం ఇది రెండోసారి అవుతుంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను నిలిపివేశారు. అప్పుడు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై ఫెడరల్ కోర్టు కేసు వేసి గెలిచింది. ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను రద్దు చేసింది.

ఆందోళన వ్యక్తం చేస్తున్న కంపెనీలు

ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై దాదాపు అన్ని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్ 1బీ వీసాతో టెక్ కంపెనీలు తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించకుంటున్నాయని…దాని వలన అమెరికాలో జనాలకు ఉద్యోగాలు తక్కువ అయిపోతున్నాయన్నది ట్రంప్ వాదన. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయంవలన అమెరికా ప్రజలతో పాటూ టెక్ కంపెనీలు కూడా సంతోషిస్తాయని అన్నారు. కానీ నిజానికి అవన్నీ కూడా ఈ నిర్ణయంపై విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీల సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉందని భయపడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పోరటానికి సిద్ధమయ్యాయని తెలుస్తోంది. దీంతో పాటూ పలు సంఘాలు కూడా హెచ్ 1బీ వీసా ఫీజులకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి.

H-1B వీసా రుసుము ఎంత?
$100,000
వారు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, లేకుంటే మేము భర్తీ చేయబడము.” ఇప్పుడు H-1B వీసా దరఖాస్తుల కోసం కొత్త $100,000 రుసుము దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కవర్‌డేల్ వంటి వారికి ఇబ్బందిని కలిగిస్తుంది, వారు విద్య మరియు ఆరోగ్య సంరక్షణ వంటి నైపుణ్యం కలిగిన వృత్తులలో ఖాళీలను భర్తీ చేయడానికి వలసదారులపై ఆధారపడతారు.

H-1B వీసాకు ఎవరు అర్హులు?
H-1B వీసాకు అర్హత పొందాలంటే, ఒక విదేశీ కార్మికుడు తప్పనిసరిగా US యజమాని నుండి "స్పెషాలిటీ వృత్తి"లో ఉద్యోగ ఆఫర్‌ను కలిగి ఉండాలి, దీనికి సాధారణంగా బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ లేదా దానికి సమానమైన అర్హత అవసరం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Chamber of Commerce H1B visa Immigration Reform Skilled Workers tech industry Telugu News US Court Case US Immigration Visa Policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.