📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Ranjani Srinivasan :ఉగ్రవాదుల ప్రమేయం ఆరోపణలతో రంజని వీసా రద్దు

Author Icon By Anusha
Updated: March 15, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో డాక్టోరల్ విద్యార్థినిగా చదువుకుంటున్న భారతీయురాలు రంజని శ్రీనివాసన్ స్వచ్ఛందంగా దేశాన్ని వదిలి వెళ్లారు. పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్నందుకు ఆమె వీసాను మార్చి 5న యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ రద్దు చేసింది.ఉగ్రవాద సంస్థ అయిన హమాస్‌కు మద్దుతునిచ్చే కార్యకలాపాల్లో రంజని శ్రీనివాసన్ పాల్గొన్నారు. మార్చి 5న ఆమె వీసాను విదేశాంగశాఖ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 11న స్వీయ బహిష్కరణకు సంబంధించి కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీపీబీ) యాప్‌ను ఉపయోగిస్తున్న ఫుటేజీని హోంల్యాండ్ సెక్యూరిటీ సంపాదించింది అని హోంల్యాండ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. 

అసోసియేటెడ్ ప్రెస్ వార్త సంస్థ

రంజని శ్రీనివాసన్ తన లగేజీతో విమానాశ్రయంలో వేగంగా నడుచుకుంటూ వెళ్లుతున్న వీడియోను హోంల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసింది. ఆమె మంగళవారం అమెరికా విడిచిపెట్టిందని వాషింగ్టన్ టైమ్స్, హోంల్యాండ్ సెక్యూరిటి నివేదించింది.కొలంబియా యూనివర్సిటి తమ క్యాంపస్‌లో “అక్రమ వలసదారులను” దాచిపెట్టిందా అనే విషయంపై అమెరికా న్యాయ విభాగం దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారి శుక్రవారం వెల్లడించారు. గత ఏడాది పాలస్తీనా మద్దతు నిరసనల్లో పాల్గొన్న విదేశీయులను బహిష్కరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్త సంస్థ నివేదించింది.గురువారం సాయంత్రం, హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ వారెంట్‌తో రెండు యూనివర్సిటీ క్యాంపస్‌లలో తనిఖీలు చేపట్టారు. అయితే, ఎవరినీ అరెస్ట్ చేయలేదు. వారు ఎవరిని వెతుకుతున్నారో స్పష్టత లేదు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నిరసనకారుల కోసం గాలిస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు.

ట్రంప్ ప్రభుత్వం ఆమె వీసాను రద్దు చేసిన తర్వాత, కొలంబియా యూనివర్సిటీలో డాక్టోరల్ విద్యార్థినిగా ఉన్న రంజని శ్రీనివాసన్ అమెరికా నుంచి విమానంలో బయలుదేరి వెళ్లారు. న్యూజెర్సీ, న్యూఅర్క్‌లోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గత ఏప్రిల్‌లో యూనివర్సిటీలో జరిగిన నిరసనల సందర్భంగా అరెస్ట్ అయిన పాలస్తీనా మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వీసా గడువు ముగిసిన తర్వాత దేశాన్ని వీడి వెళ్లలేదన్న అభియోగం మోపారు.న్యాయ శాఖ డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే మాట్లాడుతూ ఈ దేశంపై విద్వేషాన్ని అంతం చేయాలనే అధ్యక్షుడి లక్ష్యంలో ఇది భాగమని అన్నారు.

కొలంబియా విశ్వవిద్యాలయం

ట్రంప్ ప్రభుత్వం నుండి కొలంబియా విశ్వవిద్యాలయం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.ట్రంప్ ప్రభుత్వం నుండి కొలంబియా విశ్వవిద్యాలయం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లు, ఒప్పందాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువ భాగం వైద్య పరిశోధనల కోసమే ఉంది. గత వసంతకాలంలో భారీ నిరసనల సమయంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విమర్శించిన విద్యార్థులు, అధ్యాపకులపై యూనివర్శిటీ కఠినంగా చర్యలు తీసుకోకపోవడానికి శిక్షగా ఈ ఒప్పందాలను రద్దుచేసింది.డోనాల్డ్ ట్రంప్, ఇతర అధికారులు నిరసనకారులను “ప్రో-హమాస్” అని అభియోగాలు మోపారు.పాలస్తీనా కార్యకర్త మహ్మౌద్ ఖలీల్ అరెస్టు తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లోఆందోళన నెలకొంది. ఇటీవల జరిగిన నిరసనలకు ఆయన నాయకత్వం వహించారు.

#ColumbiaUniversity #HomelandSecurity #InternationalStudents #PalestineProtests #RanjaniSrinivasan #SelfDeportation #StudentVisa #UrbanPlanning #USImmigration #USVisaRevoked Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.